ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపుపై కొద్దిరోజులుగా టీడీపీ అధినేత కుస్తీ పడుతుండడంతో అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలైంది. అసెంబ్లీ వారీగా కాకుండా పార్లమెంట్‌ స్థానాన్ని యూనిట్‌గా చేసుకుని ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎంపీ అభ్యర్థితో పాటు ఆ పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికను ఏక కాలంలో చేపట్టనున్నట్టు సమాచారం. ఎమ్మెల్యేలను ఒక్కొక్కరుగా పిలిచి పరిస్థితిని అడిగి తెలుసుకుని, సంబంధిత ఎమ్మెల్యే గురించి నివేదికను అక్కడే చదివి విన్పించి.. బాగా లేకుంటే హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీ అభ్యర్థి గురించి సిట్టింగ్‌ ఎమ్మెల్యేల అభిప్రాయం అడగడం ద్వారా ఎంపీ అభ్యర్థి ప్లస్‌, మైనస్‌లను తెలుసుకుంటున్నట్లు సమా చారం.

gannvaarma 22022019

దీంతో పాటు సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యేకు సంబంధించి సీటు దక్కేదీ లేనిదీ డైరెక్టుగా చెప్పడం లేదు. ఒక వేళ టిక్కెట్టు దక్కే అవకాశం ఉంటే ‘ వెళ్లి ప్రజల్లో ఉండండి.. పథకాలను, భవిష్యత్‌ పరిస్థితులను వివరించండి. ప్రతి పక్ష నాయకుల మైనస్‌లు గుర్తించి ప్రజలకు వివరించండి.’ అంటున్నట్లు చెబుతున్నారు. టిక్కెట్టు మార్చే యోచన ఉన్న చోట్ల సంబంధిత ఎమ్మెల్యేల సమీక్షలో చివరిగా ప్రజల్లోనే ఉండండి. టిక్కెట్టు ఎవరికి వచ్చినా కలిసికట్టుగా పనిచేయండి అని చెబుతూ పంపిస్తున్నట్లు సమాచారం. ఇలా జరుగుతున్న సమీక్షల గురించి తెలుసుకుంటున్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలకు గుబులు పట్టుకుంది. తమ పరిస్థితి ఏమిటన్నది బేరీజు వేసుకుం టున్నారు..

 

gannvaarma 22022019

ప్రజలకు అందు బాటులో ఉన్నామా, లేదా.. ఎమ్మెల్యేగా పనితీరు పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి ఏ స్థాయిలో ఉంది.. ప్రభుత్వ కార్యక్రమాల అమలు, వివిధ శాఖల పనితీరును మెరుగు పర్చే దిశగా ఏమైనా కృషి చేశామా.. అని ఆలోచిస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎంత మందికి సాయం అందజేయగలిగామన్నది కూడా బేరేజు వేసుకుంటున్నారు. అయితే మన జిల్లాలోని కొంత మంది ఎమ్మెల్యేలు ప్రజలకు అంతంత మాత్రంగా అందుబాటులో ఉంటున్న పరిస్థితి ఉంది. అలాగే సెటిల్‌మెంట్లు చేస్తున్న వారూ ఉన్నారు. గ్రూపుల బెడదను ఎదుర్కొంటున్న నాయకులు ఉన్నారు. కొన్ని చోట్ల స్థానిక ప్రజా ప్రతినిధు లుగా ఉన్న ఎంపీపీ, జడ్పీటీసీ, పార్టీ మండల అధ్యక్షులతో పొసగని వారు న్నారు. ఇటీవల కాలంలో జిల్లా టీడీపీలో గ్రూపుల బెడద స్పష్టంగా కన్పిస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read