వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నరఏళ్ళు ఉన్నా, జగన్ మోహన్ రెడ్డి ముందస్తుకు వెళ్ళిపోతారు అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. మరో పక్క తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తారు అంటూ ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్టే, జనసేన, బీజేపీకి దూరంగానే ఉంటుంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా చోట్ల టిడిపి, జనసేన కలిసి పని చేసాయి. అప్పటి నుంచి టిడిపి, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తారు అంటూ ప్రచారం జరిగుతుంది. అయితే ఇరు పార్టీల అధినేతలు మాత్రం, ఈ విషయం పై ఎక్కడా స్పందించ లేదు. అయితే నిన్న ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు, హైదరాబాద్ వచ్చే ముందు, మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను పొత్తులు గురించి ప్రస్తావించగా, కీలక వ్యాఖ్యలు చేసారు. పొత్తులు ఉంటేనే గెలుపు వస్తుందని, తాము అనుకోవటం లేదని అన్నారు. పొత్తులు ఉన్నపుడు గెలిచిన సందర్భాలతో పాటు, పొత్తులు ఉన్నప్పుడు ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటూ చంద్రబాబు గుర్తు చేసారు. పొత్తుల పై చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. ఆయన వ్యాఖ్యల్లో పొత్తులు ఉండవు అనే విషయమే అర్ధం అయ్యే విధంగా వ్యాఖ్యలు చేసిన విధానం, ఇప్పుడు చర్చుకు దారి తీసింది.

CBN 27102021 2

టిడిపితో కలిసి జనసేన ఒక 20-30 స్థానాల్లో పోటీ చేస్తుందని అందరూ భావించారు. కానీ, ఇప్పుడు చంద్రబాబు మాటలు చూస్తుంటే, ఆయన పొత్తులు గురించి పెద్దగా ఆలోచన లేనట్టుగానే తెలుస్తుంది. ఒక వేళ పొత్తులతో వెళ్ళే ఆలోచనే ఉండి ఉంటే, ఆయన స్పందన వేరేల ఉండేదని, భావసారూప్యత ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటాం అని చెప్పి ఉండేవారని అంటున్నారు. ఇక తాను అధికారంలో ఉన్న సమయంలో, పార్టీ పైన దృష్టి పెట్టలేదని, ఈ తప్పుని తాను ఒప్పుకుంటున్నా అని చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం పార్టీ పైన దృష్టి పెట్టాం అని అన్నారు. సీనియర్లకు వారి విలువ ఇస్తూనే, జూనియర్లకు కూడా సరైన విధంగా ప్రోత్సాహం ఇస్తున్నాం అని అన్నారు. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో ఇంచార్జ్ లను నియమించాలని, అక్కడ పోటీ ఎకువగా ఉండటంతో, టైం పడుతుందని అన్నారు. త్వరలోనే అక్కడ కూడా ఇంచార్జ్ ల నియామకం చేస్తాం అని చంద్రబాబు అన్నారు. అన్ని విధాలుగా, అన్ని వైపుల నుంచి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read