నిన్న శాసనమండలిలో జరిగిన రణరంగం అందరికీ తెలిసిందే. మండలి చైర్మన్ ను, మతం పేరుతొ, వైసీపీ మంత్రులు బెదిరించారని, బూతులు తిట్టారని, నిన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మేల్సీలు బయటకు వచ్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే దాని పై చర్చ జరుగుతూ ఉన్న సందర్భంలోనే, ఇప్పుడు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. టిడిపి నేతలతో, ఈ రోజు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏకంగా వైసిపి మంత్రులే, కౌన్సిల్ ఛైర్ పర్సన్ షరీఫ్ పై దాడి చేశారని చంద్రబాబు అన్నారు. ముస్లిం సమాజాన్ని అవమానపర్చేలా ఛైర్ పర్సన్ షరీఫ్ పై దుర్భాషలాడారని చంద్రబాబు అన్నారు. అసభ్య పదజాలంతో సభాపతిని అవమానించారని చంద్రబాబు అన్నారు. సాయంత్రం వేళ, నమాజు చేయనీకుండా వైసిపి మంత్రులు అడ్డం పడ్డారని చంద్రబాబు అన్నారు. ముందు మాట్లాడాలి, ఆ తర్వాతే నమాజు గిమాజు అని మంత్రి బొత్స అవహేళన చేశారని చంద్రబాబు ఆరోపించారు. మీకూ పిల్లలు, మనవళ్లు ఉన్నారని గుర్తుంచుకోండని బెదిరించారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు.

tele conf 23012020 2

ఇక అలాగే నిన్న కౌన్సిల్ లో టిడిపి ఎమ్మెల్సీలు అసాధారణంగా పోరాడారని చంద్రబాబు అభినందించారు. ధర్మాన్ని కాపాడారు, రాష్ట్ర భవిష్యత్తును కాపాడారు, ప్రజాస్వామ్యాన్ని బతికించారు అంటూ కితాబు ఇచ్చారు. అనుభవజ్ఞుడి అండ ఎంత అవసరమో యనమల నిరూపించారని అన్నారు. యనమల అనుభవం- పరిజ్ఞానంతో ప్రజాస్వామ్యానికి జీవం పోశారని, అన్నారు. టిడిపి యువ కౌన్సిలర్ల ధైర్యం, తెగువ ప్రశంసనీయం అని చంద్రబాబు మెచ్చుకున్నారు. ముగ్గురు మంత్రులు లోకేష్ పై దౌర్జన్యం చేశారని, ఉన్మాదంతో, రాక్షసత్వంతో పోరాడటానికి సర్వశక్తులూ ఒడ్డాల్సిందేనని అన్నారు. భోజనం లేకున్నా, అనారోగ్యంతో ఉన్నా అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారని, ఫరూక్, శత్రుచర్ల అనారోగ్యాన్ని కూడా లేక్క చేయలేదని చంద్రబాబు అన్నారు. ఇక అలాగే అసెంబ్లీలో జరిగిన పరిణామాల పై కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. శాంతియుతంగా చేస్తున్న టిడిపి ఎమ్మెల్యేల ఆందోళనను అడ్డుకున్నారని, రింగుదాటి వస్తే బైట పడేయండని సీఎం జగన్ మార్షల్స్ ను ఆదేశించారని, మరి అదే వైసిపి మంత్రులు కౌన్సిల్ లో చేసిందేమిటి..? పోడియం బల్లలు ఎక్కి, పేపర్లు చించి సభాపతిపై విసిరిన మంత్రులను, వైసిపి ఎమ్మెల్సీలను ఏం చేయాలి..? ప్రజాస్వామ్యాన్ని చెరపట్టాలని వైసిపి చూసిందని చంద్రబాబు అన్నారు.

tele conf 23012020 3

సంఖ్య కాదు ముఖ్యం, స్పూర్తి ముఖ్యం అని రుజువు చేశారని చంద్రబాబు అన్నారు. సభలో వైసిపి ఎన్నో దురాగతాలకు పాల్పడింది. కరెంట్ కట్ చేశారు, ఇంటర్నెట్ బంద్ చేశారు..25మంది మంత్రులు కౌన్సిల్ లోనే తిష్ట వేసి వీరంగం చేశారు, అయినా నిలబడ్డారని చంద్రబాబు అన్నారు. 1984ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని గుర్తుతెచ్చారు, అప్పుడూ ఇలాగే సభలోపల, బయటా పోరాటం చేశాం అని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. గల్లా జయదేవ్ ను శారీరకంగా మానసికంగా హింసించారు, ఎంపిని 15గంటలు పోలీస్ స్టేషన్లన్నీ తిప్పారు, గోళ్లతో రక్కారు, చొక్కా చించారు,జైలుకు పంపించారు, అర్ధరాత్రి గంటల తరబడి నన్ను, ఎమ్మెల్యేలను పోలీసు వాహనంలో తిప్పారని చంద్రబాబు అన్నారు. "ఉద్యమకారులుగా ఉన్నతాశయంతో పోరాడుతున్నారు. చరిత్రలో మీ పోరాటం మిగిలిపోతుంది, మీ త్యాగాలు వృధా కావు. మీ స్ఫూర్తి కలకాలం చరిత్రలో నిలిచిపోతుంది. చట్ట సభ పోరాటంలో ప్రజా ఆకాంక్షలను టిడిపి నిలబెట్టింది. ఇక ఇప్పుడు అంతా ప్రజల చేతుల్లోనే ఉంది. జెఏసి పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి. అంబేద్కర్ సాక్షిగా నేడు జరిగే ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలి. దీనిని ఒక ప్రజావిజయంగా గ్రామగ్రామానా జరపాలి." అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read