టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఈ రోజు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గుననున్నారు. ఈ రోజు ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు, కొద్ది సేపటి క్రితం తిరుమల చేరుకొని, శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా రెండు రోజుల క్రితం, రమణదీక్షితులు, జగన్ మోహన్ రెడ్డి విష్ణుమూర్తి అంటూ పొగడటం పై, అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు తిరుమలలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, రమణ దీక్షితులు పై పరోక్షంగా స్పందించారు. దేవుడు అనే వాడు దేవుడే అని, మనిషి అనే వాడు మనిషిగానే చూడాలని, ఒక మనిషి ఎప్పుడూ దేవుడు అవ్వలేడు అని, మనుషులను దేవుడుతో పోల్చటం తప్పు అని అన్నారు. తిరుమలలో ఇప్పుడే కాదని, గతంలో కూడా, ఇలాంటి అపవిత్ర కార్యక్రమాలు చేసారని అన్నారు. తిరుమలలో లేని పింక్ డైమెండ్ ఉంది అంటూ, తీవ్ర ఆరోపణలు చేసిన వ్యక్తిని మళ్ళీ నియమించటం, మంచి సంప్రదాయం కాదని చంద్రబాబు అన్నారు. గతంలో రమణ దీక్షితులు, పింక్ డైమెండ్ పోయింది అంటూ, తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే దీని పై రమణదీక్షితులు పై, పరువు నష్టం కేసు కోర్టులో ఉంది.

cbn 080432021 2

అయితే ఈ ఆరోపణలు చేసి, తిరుమల పరువు నష్టం కేసు ఎదురుకున్న వ్యక్తిని మళ్ళీ నియమించటం పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు మాట్లాడుతూ, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని అన్నారు. అనేక ఘటనలు ఇందుకు నిదర్శనం అని అన్నారు. ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి పై ఉంటుందని,ధర్మాన్ని మనం కాపాడితే, ధర్మం మనలని కాపడుతుంది అంటూ చంద్రబాబు వ్యాఖ్యనించారు. అంతే కాదు, తిరుమల వెంకన్న విశిష్టత చెప్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతి పెద్ద ఆస్తి వెంకటేశ్వర స్వామి అని చంద్రబాబు అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత, మన అందరి పై ఉందని చంద్రబాబు అన్నారు. చంద్రబాబుతో పాటుగా ఇతర తెలుగుదేశం సీనియర్ నాయకులు, శ్రీవారిని దర్శించుకున్నారు. మరి కొద్ది సేపట్లో చంద్రబాబు తిరుపతి చేరుకోనున్నారు. ఈ రోజు సాయంత్రం నుంచి తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గుంటారు. ఇప్పటికే, నారా లోకేష్ తో పాటుగా, ఇతర తెలుగుదేశం నేతలు ఉదృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గుంటున్న విషయం తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read