నేరస్థులతో పోరాటం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెదేపా నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ పడేది నేరస్థులతోనే అని సీఎం చంద్రబాబు తెలిపారు . నేరస్థుల ఆలోచనలు భిన్నంగా ఉంటాయన్నారు. వివిధ మార్గాల్లో దుష్ప్రచారం చేస్తారన్నారు. హత్యలు, దోపిడీలు, దాడులు ప్రత్యర్థుల సంస్కృతి ఆధిక్యం కోసం దేనికైనా దిగజారే పార్టీ వైసీపీ అని, నేరమయ రాజకీయాలకు చిరునామా జగన్ కుటుంబం అని సీఎం దుయ్యబట్టారు. ప్రత్యర్థుల నేరచరిత్ర గుర్తుంచుకొని, ప్రతిపక్షం తప్పుడు పనులను సమర్థంగా ఎదుర్కోవాలన్నారు. తెదేపా నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

cbn jagan 21022019

వాళ్లే సీన్‌ క్రియేట్‌ చేసి దుష్ర్పచారం చేస్తారని నేతలను హెచ్చరించారు. అలాగే ఫోటోలను మార్ఫింగ్‌ చేస్తారని.. వీడియో కటింగ్‌లు చేస్తారని చెప్పారు. అందుకే నేరస్థులతో పోరాటంలో మరింత అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించారు. చేయని తప్పులు తమపై రుద్దుతారని, తప్పులు జరిగేలా స్కెచ్‌లు వాళ్లే వేస్తారని దుయ్యబట్టారు. ఒక కన్ను ఎప్పుడూ ప్రతిపక్షంపై ఉండాలని నేతలతో చంద్రబాబు అన్నారు. రాజధానిలో రూ.లక్ష కోట్ల అవినీతి అని దుష్ర్పచారం చేసిన వైసీపీ...ఆ వ్యవహారాన్ని తాను ఖండిస్తే వెనక్కి తగ్గిందని గుర్తుచేశారు. భూములు రైతుల వద్దే ఉంటే అవినీతికి చోటెక్కడ అని ప్రశ్నించారు. రాజధానికి భూములు ఇవ్వకుండా రెచ్చగొట్టారని..రైతులు వినకపోతే విధ్వంసాలకు తెగబడ్డారని ఆయన ఆరోపించారు. రాజధానికి, పోలవరంకు వ్యతిరేకంగా అనేక కేసులు వేశారన్నారు.

cbn jagan 21022019

రాజకీయాల్లో నేరగాళ్లను తెచ్చిన పార్టీ వైసీపీ అని విమర్శించారు. నేరమయ రాజకీయాలకు చిరునామా జగన్‌ కుటుంబమన్నారు. మోదీ, షా, కేసీఆర్‌, జగన్‌ కుమ్మక్కై కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. నలుగురి కుట్రలను ధైర్యంగా ఎదుర్కోవాలని నేతలకు తెలిపారు. కేసీఆర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. సామాన్యుల్లో భయం పెంచుతున్నారని అన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ కుట్రల మీద కుట్రలు చేస్తోందని, కులాల మధ్య చిచ్చు పెడుతోందని చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పార్లమెంటు వారీగా సమీక్షలు చేస్తున్నామన్నారు. నాలుగు ఎంపీ సీట్లలో ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు. అన్ని అసెంబ్లీ స్థానాలకు సమన్వయ కమిటీలు, ఏరియా కోఆర్డినేటర్లను ఏర్పాటు చేశామన్నారు. సమీక్షల సందర్భంగా వీరితో స్వయంగా సీఎం భేటి అవుతారని తెలిపారు. తెదేపా గెలుపులో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాక్షించారు. అందరికీ జవాబుదారీతనం ఉండాలన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read