టీడీపీ సీనియర్ నాయకులతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి సారి ప్రభుత్వం పై గట్టిగా పోరాడాతున్న సందర్భంలో, అవి ప్రజల్లోకి వెళ్తున్నాయి అంటే, వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అమరావతి భూములపై ఆరోపణలు కూడా అలాంటివే అని అన్నారు. టీడీపీ పై రాజకీయ కక్షతోనే అమరావతి పై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. ఇప్పటికి 16 నెలలు అయ్యిందని, మంత్రి వర్గ ఉప సంఘాలు, expert కమిటీలు, సిఐడి, ఏసిబీ ఇలా అనేక ఎంక్వయిరీలు వేసి, ఇప్పటికీ ఆధారాలు చూపించకుండా, బురద చల్లే పనిలోనే ఉన్నారని అన్నారు. దుర్మార్గుల పాలనలో మంచివాళ్లు పడే కష్టాలకు మన రాష్ట్రమే ఉదాహరణ అని చంద్రబాబు అన్నారు. తమ దోపిడీకి ఇదే చివరి అవకాశం అనే టైపులో వైసీపీ ఇష్టం వచ్చినట్టు చేస్తుందని అన్నారు. ఎవరినీ మాట్లడతనివ్వటం లేదని, ప్రజలు కూడా విసిగిపోయారని, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని, ప్రజలే వీరి పై ఎదురు తిరిగే రోజు, తొందర్లోనే ఉందని అన్నారు.

రాష్ట్రంలో ఎక్కడైనా స్వేఛ్చ ఉందా అని ప్రశ్నించారు ? ఉద్యోగులు దగ్గర నుంచి ప్రజల వరకు ఎవరు ప్రశ్నించినా తట్టుకోలేక పోతున్నారని, ఎస్సీ మహిళల పరిస్థితి దారుణంగా ఉందని, వారి మానానికి రక్షణ లేకుండా ఊళ్ళలో పరిస్థితితులు ఉన్నాయని అన్నారు. వైసీపీ చేస్తున్న అరాచకంతో ప్రాధమిక హక్కులే కాదని, జీవించే హక్కుని కూడా ప్రజలు కోల్పోతున్నారని చంద్రబాబు అన్నారు. పోలీసులని అడ్డు పెట్టుకుని, ప్రతిపక్షాన్ని అణిచివేసే కార్యక్రమం చేస్తున్నారని, పోలీసులు ఒక పార్టీ కాకుండా, అందరి హక్కుల కోసం నిలబడాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు లేకుండా చెయ్యాలనే ధోరణితో చాలా ప్రమాదం అని చంద్రబాబు అన్నారు. అలాగే రాష్ట్రంలో ఒక మతం టార్గెట్ గా కొన్ని జరుగుతున్నాయని, ఏ మత విశ్వాసాన్ని దెబ్బ తీసే హక్కు ఎవరికీ లేదనే విషయం గుర్తు పెట్టుకోవాలని చంద్రబాబు అన్నారు. అన్ని మతాలను గౌరవించి, వారి మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read