వేల కోట్లు, లక్షల కోట్లు అవినీతికి పాల్పడి దోపిడీ సొమ్ము పోగేసుకొని ఇన్ కంటాక్స్ లు కడితే సరిపోతుందంటే అంతకంటే దారుణం ఇంకోటి ఉండదని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు గారు అభిప్రాయపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి అవినీతి కేసుల్లో ఇన్కమ్ టాక్స్ డిపార్టుమెంటు, ఒక కేసు విసయంలో క్లీన్ చిట్ ఇచ్చిందని, దాని పై అభిప్రాయం చెప్పాలని చంద్రబాబుని కోరగా ఆయన స్పందించారు. చంద్రబాబు ఏ మన్నారు అంటే "అవినీతి సొమ్ముతో ఏమైనా చేయొచ్చంటే సరిపోతుందా? సాక్షిలో ఏం జరిగిందో చూడండి. రూపాయి పెట్టుబడి లేకుండా రూ.1200 కోట్లు మొబిలైజ్ చేశారని చాలా స్పష్టంగా చెప్పారు. అలా జరగడం అవినీతికాదని ఇన్ కంటాక్స్ వారికి అనిపిస్తే ఈ దేశంలో చేయగలిగింది ఏమీలేదు. అవినీతికి పాల్పడేవారిని ఎవరినీ పట్టుకోలేరు కూడా. రాబోయే రోజుల్లో కష్టపడకుండా సంపాదించడమనే జగన్ మోడల్ ప్రతి రాజకీయ నాయకుడికి న్యూమోడల్ గా మారుతుంది. సంపాదించుకున్న దానితో పనులు చేయడం.. ఆస్తులు బూస్టప్ చేసుకోవడం, 10రూపాయల షేరుని 2వేలు, 3వేలకు అమ్ముకోవడం, ఎన్నికల్లో పోటీచేయడం చేస్తారు. ఈ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. అలా చేయకపోతే రాజకీయ అవినీతి గురించి మాట్లాడే పరిస్థితి ఉండదు. భవిష్యత్ లో నీతిగా, నిజాయితీగా రాజకీయాల్లో ఉండాలని ఎవరూ కోరుకోరు..ఎవరూ ఉండరు కూడా. మొన్న నా నియోజకవర్గంలో మూడురోజులు పర్యటించాను. కుప్పం నియోజకవర్గం 40 సంవత్సరాలుగా తెలుగుదేశంపార్టీకే ఓటేస్తోంది. అలాంటి నియోజకవర్గంలో 250 వరకు క్వారీల్లో అక్రమ మైనింగ్ జరుగుతోంది."

cases 11012022 2

"అలాదోచుకున్న సొమ్మంతా సక్రమమే అనిచెబుతారా.? రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు నగదు చెల్లింపులే ఎందుకు అనుమతిస్తున్నారు? ఈ విధంగా అనేక పద్ధతుల్లో అవినీతి జరుగుతుంటే, దాన్ని ఇన్ కంటాక్స్ వారు సమర్థిస్తారా? అలా సమర్థిస్తే ఏ మనీతో ట్యాక్సులు కట్టినా వారికి హ్యపీనే కదా? రాబోయే రోజులలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీబీఐ,ఈడీ కేసుల విచారణలో ఇన్ కంటాక్స్ పాత్రేమిటనే దానిపై కూడా ఆలోచన చేయాలి. చట్ట సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విచారణలు జరుగుతున్నప్పుడు అంతా సెట్ చేయాలి.. అలా చేయకపోతే రాజకీయాలనే మున్ముందు ఒక వ్యాపారంగా తీసుకొని, ఎవరి ఇష్టమొచ్చినట్లు వారు ప్రవర్తిస్తారు. రాష్ట్రంలో ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే అక్రమ మైనింగ్ జరగడం లేదు. ఇసుక, బైరటీస్, బాక్సైట్, గ్రానైట్, ముగ్గురాయి, సిమెంట్ ముడి ఖనిజం ఇలా అన్నిదోపిడీ చేస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో ఇదే జరుగుతోంది. ఇంకో పక్కన గంజాయి సాగు. రాష్ట్రంలో ఎక్కడా లేనివి ధంగా గంజాయి సాగు జరుగుతోంది. దానికి తోడు ఎర్రచందనం స్మగ్లింగ్. మాదకద్రవ్యాల వ్యాపారం. ఈ విధంగా అక్రమంగా సంపాదించిన సొమ్ముతో రైట్ రాయల్ గా రాజకీయ నేతల్లా చలామణీ అవుతున్నారు." నఅని చంద్రబాబు అన్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read