నవ్యాంధ్ర మొదటి స్పీకర్, మాజీ హోం మంత్రి, అలాగే ఇరిగేషన్, హెల్త్, సివిల్ సప్లైస్ లాంటి కీలక శాఖలకు మంత్రిగా పని చేసిన కోడెల శివప్రసాద్ మరణించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా తప్ప, అన్ని కీలక శాఖలు చేసి, ఎంతో సేవ చేసిన కోడెల బలవంతంగా చనిపోవటం అందరినీ కలిచి వేసింది. నేటి రాజకీయంలో, సిగ్గు, మానం, అభిమానం లాంటి పదాలకు అడ్డ్రెస్ లేదు అనుకుంటున్న టైంలో, తనకు జరిగిన అవమానానికి ఆయాన చనిపోయారు అంటే ఎంతో బాధాకరం. ఒకప్పుడు పెత్తందారి వ్యవస్థకు తాను ఒక్కడే ఎదురు వెళ్లి, వాళ్లకి గుండె చూపించిన కోడెల, ఈ రోజు కావాలని వెంటాడి, వేటాడి, అవమానాలు చేసినందుకు, ఇంత జీవితంలో నాకు లభించే గౌరవం ఇంతేనా ? ఈ వేధింపులతో ఇక్కడ ప్రశాంతంగా ఉండలేను, కనీసం మరణంలో అయినా ప్రశాంతత చూసుకుంటాను అంటూ, తనకు ఇష్టమైన ఆ శివయ్య దగ్గరకే వెళ్ళిపోయారు.

cbn 17092019 2

అయితే కోడెల మరణం పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. 72 ఏళ్ళ వయసులో, ఆయన పై వ్యక్తిగత కక్ష తీర్చుకుని, ఆయన్ను మానసికంగా క్షోభ పెట్టి, గుచ్చి గుచ్చి, అవమానాల పాలు చేసి, తమ మీడియాలో ఆయాన ప్రతిష్ట దిగజారేలా, ఆయనే చనిపోయేలా చేసారని అన్నారు. దీనికి సంబంధించి ఆధారాలు కూడా చంద్రబాబు తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఆయన ఈ రోజు కేసులకు సంబంధించి ఒక పోస్ట్, అలాగే ఆయన పై నమోదైన ఫర్నిచర్ కేసు గురించి వివరాలు ఇచ్చారు. రెండు నెలల్లో కోడెల పై 19 కేసులు పెట్టారని, ఇవన్నీ గత మూడేళ్ళలో జరిగాయని అంటున్నారని, కాని వేటిలోను అవి, ఎప్పుడూ జరిగాయో కనీసం తేదీ కూడా చెప్పలదని అన్నారు. కోడెల పై వ్యతిరేకంగా కేసులు వేయాలని ట్విట్టర్‌లో, పేపర్‌లో ప్రకటనలు చేసి, సాక్షి పేపర్‌లో పదేపదే కోడెలను విమర్శిస్తూ కథనాలను రాయించారని చంద్రబాబు అన్నారు.

cbn 17092019 3

అలాగే ఫర్నిచర్ కేసు పై చంద్రబాబు స్పందిస్తూ, ఇలా ట్వీట్ చేసారు "రూ.43వేల కోట్లు దోచుకున్నారని సీబీఐ అభియోగాలున్న వ్యక్తి,11 చార్జిషీట్లలో ముద్దాయి, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సిన వ్యక్తి... కేవలం రూ.లక్ష, రెండు లక్షలు విలువైన ఫర్నిచర్‌ విషయంలో కోడెల శివప్రసాదరావుపై కేసులు పెట్టడం, ఆయనపై అవినీతి ఆరోపణలు చేయడం శోచనీయం. పల్నాటి పులి అని పిలువబడ్డ ఒక సీనియర్ రాజకీయ నేతకే ఇలాంటి పరిస్థితి తెచ్చారంటే ఇలాంటి ఉన్మాదంతో కూడుకున్న పాలనలో రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఎంతమందిని చంపుకుంటూ పోతారు? కోడెల తప్పు చేసి చనిపోలేదు, వేధింపులకు గురై చనిపోయారు. ఈ ప్రభుత్వ హత్యమీద సీబీఐ విచారణ జరగాలి." అని ట్వీట్ చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read