ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజే హాట్ హాట్ గా సాగాయి. ముఖ్యంగా కాళేశ్వరం పై చర్చ సందర్భంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు మాటల యుద్ధం జరిగింది. అలాగే ఈ రోజు కరువు పై చర్చ జరిగింది. కరవు పై చర్చ జరుగుతున్న సందర్భంలో అసెంబ్లీలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో కరువ్టు పై జగన్ మోహన్ రెడ్డి ప్రకటన చేస్తూ చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంలో రాష్ట్రంలో కరువు బాగా ఉందని, అందుకే నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు ఒక కోటి రూపాయల చొప్పున నిధులు కేటాయిస్తున్నా అని చెప్పారు. ఆ నిధులతో ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న కరువు పై వారికి ఇష్టం వచ్చిన విధంగా ఖర్చు పెట్టుకోవచ్చని చెప్పారు. సహజంగా ప్రభుత్వం ఇలాంటి ప్రకటన చేస్తే, అది అందరి ఎమ్మెల్యేలకు వర్తిస్తుంది. కాని జగన్ మాత్రం, తాను ఎదో త్యాగం చేసినట్టు, ఇది అధికార పక్ష ఎమ్మెల్యేలకే కాదు, ప్రతిపక్షానికి కూడా ఇస్తున్నాం, చంద్రబాబుకు కూడా ఒక కోటి ఇస్తాను, ఆయన కూడా ఖర్చు పెట్టుకోవచ్చు అంటూ వ్యంగ్యంగా స్పందించారు.

ఈ సమయంలో, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డి ఎంతో అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇది ఎంతో చారిత్రాత్మికమైన నిర్ణయం అని, జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై మాజీ సీఎం చంద్రబాబునాయుడు అభినందనలు తెలపాలని అన్నారు. గతంలో చంద్రబాబు వద్దకు వెళ్లి అడిగితే, ఆర్ధిక పరిస్థితి బాగోలేదు, ఇవ్వలేం అన్నారని, ఇప్పుడు జగన్ మాత్రం ఉదారంగా ఇచ్చారని అన్నారు. పెద్దిరెడ్డి వ్యాఖ్యలకు చంద్రబాబునాయుడు కౌంటర్ ఇచ్చారు. జగన్‌ చెప్పేది ఒకటి, చేసేది మరొకటంటూ చంద్రబాబు విమర్శించారు. ఎస్సీ ఎమ్మెల్యే అయిన బాలవీరాంజనేయ స్వామిను వైసీపీ ప్రభుత్వం అవమానించిందని ఆరోపించారు. ఎమ్మెల్యే స్వామికి మీ జగన్ క్షమాపణ చెబితే, అప్పుడు ఎమ్మెల్యేలకు నిధుల నిర్ణయాన్ని అభినందిస్తూ నేను కూడా ధన్యవాదాలు చెప్తానని చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్యేను కూడా దబాయించే పరిస్థితికి వచ్చారని, ఒక పక్క ఎమ్మెల్యేలను ఇలా అవమానిస్తూ, ఇక్కడ నీతులు చెప్తున్నారని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read