విశాఖలో పాలిమర్స్ పరిశ్రమ నుంచి విష వాయువు లీక్ అయిన దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు హుటాహుటిన స్పందించారు. పలువురు మృతి చెందడం, అనేకమంది ఆసుపత్రి పాలు కావడంపై దిగ్భ్రాంతి చెందారు. హుటాహుటిన చంద్రబాబు స్పందించి విశాఖ టిడిపి నాయకులను అప్రమత్తం చేశారు. దుర్ఘటనా స్థలానికి వెంటనే వెళ్లాలని, బాధితులను ఆదుకోవాలని, మృతుల కుటుంబాలకు అండగా ఉండాలని ఆదేశించారు. స్థానిక టిడిపి ఎమ్మెల్యే గణబాబు తెల్లవారుజామునే సంఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఒకవైపు మృతుల కుటుంబాలను ఊరడించడం, మరోవైపు బాధితులను తరలించడంపై అధికారులను అప్రమత్తం చేశారు. స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు చంద్రబాబుకు నివేదిస్తున్నారు.

జిల్లా పార్టీ నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ కు మెయిల్ ద్వారా లేఖ పంపారు. ప్రధానమంత్రి ప్రత్యేక కార్యదర్శికి మెయిల్ పంపారు. ఒకవైపు కేంద్రంలో అధికారులకు సమాచారం పంపిస్తూ, మరోవైపు విశాఖ నాయకులతో, అధికారులతో సంప్రదిస్తూ సహాయ చర్యలను వేగిరపర్చేలా చేశారు.

‘‘గాలిలో విష వాయువుల తీవ్రత ఎంత ఉంది అధ్యయనం చేయాలి. ఎంత పరిధిలో ప్రజలు ప్రభావితం అవుతారు అనేది అంచనావేయాలి. ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, విష వాయువుల ప్రస్తుత ప్రభావం, దీర్ఘకాలిక ప్రభావం, సాధారణ పరిస్థితి ఎప్పటికి నెలకొంటుంది అనేవాటిపై నిపుణులతో చర్చించాలి. వారిచ్చిన సూచనల మేరకు యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. మృతుల కుటుంబాలను ఆదుకోవాలి. బాధితులకు అత్యున్నత వైద్యం సత్వరమే అందించాలి. ప్రాణనష్టం నివారించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read