గత ఏడాది కాలంలో, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ పోస్ట్ పెట్టినా, అరెస్ట్ చేపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక టిడిపి నేతలను కూడా ఎక్కడ చిన్న అవకాసం ఉన్నా, అరెస్ట్ చేస్తున్నారు. అయితే ఈ సందర్భంలో, నెల్లూరు జిల్లాకు చెందిన, శ్రీకాంత్ రెడ్డి అనే ఒక కార్యకర్త, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు అంటూ, ఒక హెడ్ కానిస్టేబుల్, శ్రీకాంత్ రెడ్డికి ఫోన్ చేసి, బెదిరించారు. ఈ ఫోన్ సంభాషణ వైరల్ అయ్యింది. నేను బూతులు తిట్టలేదని, ప్రభుత్వాన్ని ప్రశ్నించానని, అదే తప్పు అయితే, కేసు పెట్టి ఆక్షన్ తీసుకోండి, అంటూ శ్రీకాంత్ రెడ్డి, ఆ పోలీస్ కు చెప్పటం, ఇదంతా వైరల్ అయ్యింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు, శ్రీకాంత్ రెడ్డికి స్వయంగా ఫోన్ చేసారు. ఏకంగా తమ పార్టీ అధినేత ఫోన్ చెయ్యటంతో, శ్రీకాంత్ రెడ్డి, సంతోషంతో, చంద్రబాబుకి జరిగిన విషయం చెప్పారు.

చంద్రబాబు మాట్లాడుతూ "శ్రీకాంత్ రెడ్డి గారు, మీకు జరిగింది తెలిసింది. చాలా ధైర్యంగా మాట్లాడారు. ఏ మాత్రం, భయపడకుండా, మనకు ఉండే హక్కులు కాపాడటానికి, మీరు మాట్లాడారు. మీ ధైర్యానికి మనస్పూర్తిగా అభినందనలు. ఎందుకంటే, పోలీస్ వ్యవస్థ అంటే, ప్రజలను రక్షించే విధంగా ఉండాలి కాని, ఫోన్లు చేసి బెదిరించటం కరెక్ట్ కాదు. నేను ఉన్నప్పుడు, పోలీసులు బాధ్యతగ గౌరవంగా ప్రవర్తించాలి అని, బాడీ వొర్న్ కెమెరా పెట్టాం. కాని, వీళ్ళు అన్నీ తీసేశారు. నిన్న ఆ పోలీస్ మాట్లాడిన తీరు, లెక్క లేకుండా మాట్లాడారు. మీరు కూడా ధైర్యంగా మాట్లాడారు. నేను ఏమి తప్పు చేసాను, వారెంట్ ఉందా, అసభ్యంగా ఎక్కడ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందు అరెస్ట్ చెయ్యండి అంటూ ఎంతో ధైర్యంగా మాట్లాడారు. మీరు రాష్ట్రంలో ఉండే కార్యకర్తలు అందరికీ ఆదర్శంగా మిగిలారు. మనం తప్పు చెయ్యనప్పుడు ఎందుకు భయపడాలి ? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మీకు ఏ సహాయం కావాలి అన్న చెప్పండి, పార్టీ మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది" అంటూ చంద్రబాబు మాట్లాడారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read