ఉదయం నుంచి ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు ఇంటి పైన ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి డ్రోన్ కెమెరా రన్ చేసే ప్రయత్నం చేసారు. అయితే, అక్కడ ఉన్న చంద్రబాబు సిబ్బంది వారిని నిలదియ్యటంతో వారు పొంతన లేని సమాధానాలు చెప్పారు. వారి దగ్గర ఏ విధమైన ఐడి కార్డులు కూడా లేవు. వారు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, లాంటి ప్రశ్నలకు సమాధానం లేకపోవటంతో, అక్కడ ఉన్న కొంత తెలుగుదేశం నాయకులు వారిని అడ్డుకున్నారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు, హుటాహుటిన వచ్చి, వారిని అక్కడ నుంచి పంపించివేసే ప్రయత్నం చేసారు. అయితే టిడిపి నాయుకులు మాత్రం, అందుకు ఒప్పుకోలేదు, దీంతో వివాదం పెద్దది అయ్యింది. పోలీసులు లాఠీచార్జ్ చేసే దాకా వెళ్ళింది.

phone 16082019 1

అయితే ఈ విషయం పై చంద్రబాబు మాత్రం ఘాటుగా స్పందించారు. వెంటనే రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ కు ఫోన్ చేసారు. అలాగే గుంటూరు ఎస్పీకి కూడా ఫోన్ చేసారు. తాను నివసించే ఇంటి పై డ్రోన్లు ఎవరి అనుమతితో తిప్పారని అడిగారు. హైసెక్యూరిటీ జోన్‌లో ఉన్న తన నివాసం పై డ్రోన్లు ఎగరడంపై డీజీపీని చంద్రబాబు నిలదీశారు. డ్రోన్లు నా నివాసం మీదే ఎందుకు వినియోగించారు?. అనుమతులు ఎవరిచ్చారు, నా సెక్యూరిటీ అయినా ఎన్ఎస్జీకి సమాచారం ఇచ్చారా ? ఆ డ్రోన్ వీడియో బయటకు ఎలా వచ్చింది అంటూ ప్రశ్నలు సంధించారు. మీరు వారికి పర్మిషన్ ఇచ్చారా ? డీజీపీ అనుమతి లేనిదే, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేనిదే ఎవరు డ్రోన్ లు వినియోగించకూడదు. చివరకు రాష్ట్రంలో ప్రజల భద్రతే కాక, తన భద్రతను కూడా ప్రశ్నార్ధకంగా మారుస్తారా అంటూ మండిపడ్డారు.

phone 16082019 1

నాకు భద్రత తగ్గించారు. జామర్ తీసేశారు. చివరకు కోర్ట్ కు వెళ్లి, భద్రత తెచ్చుకోవాల్సిన పరిస్థితి తీసుకువచ్చారు. ఇప్పుడు ఏకంగా నన్నే టార్గెట్ చేస్తూ, డ్రోన్లు తిప్పుతున్నారు అని మండిపడ్డారు. ఒక పక్క కోర్ట్ స్పష్టంగా చెప్పినా, నా భద్రతతో ఆటలు ఆడుకుంటున్నారని మండిపడ్డారు. కిరణ్ అనే వ్యక్తి తన నివాసం పై డ్రోన్ లు తిప్పమని పంపించారు అంట, అతను ఎవరు ? అతని వివరాలు ఏంటి అని చంద్రబాబు నిలదీసారు. అక్కడ పట్టుబడిన వాళ్ళు, జగన ఇంటి నుంచి, కిరణ్ అనే వ్యక్తి పంపించారు అని చెప్తున్నారు, అతని వివరాలు నాకు చెప్పండి అని అన్నారు. జగన్ ఇంటి పై కూడా ఇలాగే డ్రోన్లు తిప్పుతారా ? ఆయన ఇల్లు మొత్తం వీడియో తీసి, ఇలాగే మీడియాలో వేస్తారా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.

Advertisements

Add comment


Security code
Refresh

Advertisements

Latest Articles

Most Read