తెలంగాణలో రాష్ట్రంలోరాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. తెలంగాణలో అసెంబ్లీని రద్దు చేసి, ముందుగానే ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయిచినట్లు పార్టీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అదే కనుక జరిగితే తెలంగాణలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏ విధమైన వ్యూహం పాటించాలన్న విషయమై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇప్పటికే టీటీడీపీ నేతలతో భేటి జరిపినట్టు సమాచారం. కేసిఆర్ అసెంబ్లీ రద్దు ప్రకటించిన వెంటనే తెలంగాణలో విస్తృతంగా పర్యటించాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం.

cbn 05092018 2

తెలంగాణలో టీటీడీపీలో బలమైన నేతలు లేకపోయినా,బలమైన కేడర్ మాత్రం ఉందని, చంద్రబాబు బలంగా నమ్ముతున్నారని, అందరిని ఏకతాటిపైకి తెచ్చేందుకు ఆయనే స్వయంగా కదలాలని భావిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రబుత్వాన్ని ను ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఒక్కటే మార్గమని నాయకులూ చంద్రబాబుబుకి సూచిస్తున్నారట. ఒక వేళ అదే కనుక జరిగి తెలంగాణలో, టీటీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే అటువంటి పరిస్థితి లో ఏపీలో ఏం చేయాలన్నదానిపైనా చంద్రబాబు తన వర్గాలతో ఇప్పటికే చర్చించారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

cbn 05092018 3

చంద్రబాబు, తెలంగాణ అసెంబ్లీ రద్దయినట్టు అధికారిక ప్రకటన వెలువడిన తరువాతే ఎటువంటి వ్యూహాన్నైనా అమలుచేయాలని, అప్పటివరకూ ఎప్పటికప్పుడు జరిగే పరిణామాలను తనకు తెలియచేయాలని తెలంగాణ నేతలను చంద్రబాబు ఆదేశించినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో పాలనా పరంగా, రాజకీయంగా ఎటువుంటి ఇబ్బంది లేకుండా, చంద్రబాబు పావులు కదపనున్నారు. మరో పక్క పవన్ కళ్యాణ్, జగన్, కెసిఆర్ కి సపోర్ట్ ఇస్తూ ఉండటం కూడా పరిగణలోకి తీసుకుని, తగు విధంగా, అక్కడ రాజకీయం చెయ్యనున్నారు. అయితే, ఈ తరుణంలో బీజేపీని కూడా వదిలిపెట్టకూడదని, బీజేపీ తెలంగాణాకు కూడా అన్యాయం చేసిన విధానం, కెసిఆర్ సరిగ్గా పోరాడకపోవటం కూడా, ప్రజలకు వివరించనున్నారు అని తెలుస్తుంది.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read