తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జగన్ ప్రభుత్వానికి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు వైసిపీ నేతలు అంతా, అమరావాతే రాజధాని అని నమ్మించారు. ఎన్నికల ప్రచారంలో, అలాగే వివిధ సందర్భాల్లో అమరావతి రాజధానిగా ఉంటుందని, తెలుగుదేశం పార్టీ మభ్య పెడుతుంది అంటూ వైసీపీ నేతలు చెప్పారు. ఇక సాక్షాత్తు జగన్ మోహన్ రెడ్డి కూడా, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నా, మభ్య పెట్టవద్దు అంటూ, చెప్పిన మాటలు, అలాగే సాక్షాత్తు అసెంబ్లీలో కూడా, అమరావతి రాజధానిగా ఒప్పుకుంటున్నాం అని, కాకపొతే 30 వేల ఎకరాల్లో రాజధాని రావాలి అంటూ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు అదంతా గతం. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. రాగానే అమరావతి పనులు ఆపేసారు. కొత్తగా మొదలు పెడతారు అని అందరూ అనుకున్నారు. రెండు నెలలు, మూడు నెలలు, ఇలా కాలం గడిచి పోతున్నా, అమరావతి గురించి మాట్లాడటం లేదు. ఇక ఫైనల్ గా, నవంబర్ నెలలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అని అసెంబ్లీలో చెప్పి, బాంబు పేల్చారు.

తరువాత శాసనమండలి సెలెక్ట్ కమిటీకి వెళ్ళటం, ఆ తరువాత కోర్టుకు వెళ్ళటం జరిగాయి. అయిన సరే గవర్నర్ చేత బిల్లులు ఆమోదించుకున్నారు. దీని పై తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వాన్ని నిలదీసింది. ఒక ప్రభుత్వానికి రైతులు భూములు ఇస్తే, ఇలా అన్యాయం చేస్తారా అని నిలదీసింది. అంతే కాదు ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని నమ్మించి, ఇప్పుడు ఇలా చెయ్యటం పై, చంద్రబాబు ప్రజా తీర్పు కోరదాం రమ్మని, జగన్ కు చాలెంజ్ చేసారు. 48 గంటల్లో ఏ నిర్ణయం చెప్పాలని, అసెంబ్లీని రద్దు చేసి, మూడు రాజధానుల పై ప్రజా తీర్పు కోరదామని అన్నారు. ఆ 48 గంటల గడవు మరో గంటలో ముగియనుంది. ఇటు మాట మార్చిన వైసీపీ మాత్రం, మేము రాజీనామాలు చెయ్యం, మీరే చేసుకోండి అని చెప్తుంది. ఇక మరో పక్క నిన్న కోర్టు, 14 వరకు అమరావతిని కదిలించ వద్దు అని చెప్పింది. వీటి అన్నిటి నేపధ్యంలో, చంద్రబాబు ఈ రోజు 5 గంటలకు మీడియా ముందుకు వస్తున్నారు. ఆయన ఇప్పుడు ఏ డిమాండ్ చేస్తారు అనే దాని పై సస్పెన్స్ కొనసాగుతుంది. కోర్టు తీర్పు నేపధ్యంలో వ్యూహం మార్చారా ? లేక మరో డిమాండ్ తో ముందుకు వస్తారా అనేది చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read