జగన్ మోహన్ రెడ్డి విధానాల పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చెసరు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గున్న చంద్రబాబు, కొద్ది సేపు మీడియాతో చిట్ చాట్ చేసారు. విద్యుత్ పీపీఏలు, విత్తనాల సమస్య, గోదావరి నీళ్ళు తెలంగాణాకు తీసుకుపోవటం, గన్నవరం నుంచి సర్వీసులు ఆపెయ్యటం లాంటి వ్యవహారాల పై చంద్రబాబు మీడియాతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. జగన్ ప్రభుత్వం చేసే ప్రతి చర్య తెలంగాణాకు లాభం చేకూర్చే విధంగా ఉందని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎయిర్ కనెక్టివిటీ పూర్తిగా తగ్గిపోయిందని అన్నారు. రాష్ట్రం నుంచి ఎక్కడకు వెళ్ళాలన్నా, హైదరాబాద్ వెళ్లి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారో ఏంటో అని ఆవేదన వ్యక్తం చేసారు.

gannavaram 18072019 1

ఆ రోజుల్లో కేంద్రం సహకరించక పోయినా, సింగపూర్ కు మొదటి ఇంటర్నేషనల్ ఫ్లైట్ నడిపామని, అది పూర్తీ ఆక్యుపెన్సీతో ఉన్నా కూడా, దాన్ని రద్దు చేసారని అన్నారు. అది పక్కన పెడితే, ఢిల్లీ వెళ్ళే విమానాలు కూడా తగ్గిపోయాయని చంద్రబాబు అన్నారు. వారంలో నాలుగు రోజులు మాత్రమే ఢిల్లీ సర్వీస్ ను ఎయిర్ ఇండియా తిప్పుతుంది. అలాగే సాయంత్రం ఢిల్లీ వెళ్ళే విమానం పూర్తిగా రద్దు చేసారు. ఉదయం వెళ్ళే సర్వీస్ మాత్రం, నాలుగు రోజులకు కుదించారు. అంటే దాదాపు మూడు రోజుల పాటు ఢిల్లీ వెళ్ళటానికి ఫ్లైట్ లేదు. ఈ ప్రభావంతో చార్జీలు కూడా పెరిగిపోయాయి. ఇదే విషయం చంద్రబాబు ప్రస్తావించారు. గన్నవరం నుంచి కనెక్టివిటీ తగ్గించి, అందరినీ హైదరాబాద్ వల్లే పరిస్థితి తెచ్చారని చంద్రబాబు అన్నారు.

gannavaram 18072019 1

అలాగే గోదావరి నీళ్ళ వాడకం పై, తెలంగాణాతో కలిసి ఎందుకు ముందుకు వెళ్తున్నారో అర్ధం కావటం లేదని అన్నారు. తెలంగాణా భూభాగంలో మనం ప్రాజెక్ట్ కట్టటం ఏంటి అని అన్నారు. రేపు కేసీఆర్ పొమ్మంటే ఏమి చేస్తారని ప్రశ్నించారు. పోలవరం పూర్తీ అయితే, సింపుల్ గ్రావిటీతో గోదావరి నీళ్ళు వస్తాయని, ఇది వదిలేసి కేసిఆర్ వెనుక పడుతున్నారని చంద్రబాబు అన్నారు. విద్యుత్ పీపీఏ ల విషయంలో కూడా జగన్ మోహన్ రెడ్డికి పరాభావం తప్పదని చంద్రబాబు అన్నారు. ఎక్కడైనా ధరలు నిర్ణయం తీసుకునేది రెగ్యులేటరీ అథారిటీ అని చంద్రబాబు అన్నారు. వాళ్ళని భయపెట్టి పులివెందుల పంచాయతీ చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ కుప్ప కూలి పోయిందని అన్నారు. పనుల లేక కూలీలు రోడ్డున పడ్డారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read