నిన్నటి నుంచి రాష్ట్రంలో ఒకే ఒక్క టాపిక్. అదే కియా గురించి. 2007లో వైఎస్ సూచన మేరకే, ఆయన చనిపోయినా, 10 ఏళ్ళ తరువాత, ఇప్పుడు కియాని ఏపిలో పెట్టామని, నిన్న బుగ్గన అసెంబ్లీలో చదివి వినిపించారు. దాని పై రాష్ట్రమంతా అవాక్కయింది. ఈ విషయం పాపం జగన్ మోహన్ రెడ్డికి తెలియక, మొన్నటి దాకా మోడీ తెచ్చారని ప్రచారం చేసారని అనుకుంటున్నారు. అయితే ఈ విషయం పై చంద్రబాబు నాయుడు, ఈ రోజు మీడియాతో చిట్ చాట్ చేస్తూ స్పందించారు. కియా మోటార్స్ కంపెనీ, రాజశేఖర్ రెడ్డి వల్లే వచ్చిందని చెప్పటం, వైసీపీ నేతలు ఆడుతున్న అబద్ధాలకు పరాకాష్ట అని చెప్పుకొచ్చారు. చెప్పే అబద్ధాన్ని అయినా నమ్మసక్యంగా చెప్పాలి కదా అని అన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్ట్ లు అన్ని పడకేసాయని, పోలవరం, అమరావతి, బందర్ పోర్ట్, ఇలా అన్ని ప్రాజెక్ట్ లను పక్కన పడేసారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి తనను ఏదో చేద్దామనుకుని, తన చెట్టుని , తానే నరుక్కుంటున్నారని అన్నారు. తన పై అవినీతి ముద్ర వెయ్యటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, వారి వల్ల కావటం లేదని చంద్రబాబు అన్నారు.

నిన్నటి నిన్న పోలవరం పై సిబిఐ ఎంక్వయిరీ అడిగారని, అదేమీ అవసరం లేదని కేంద్రం చెప్పిన విషయం గుర్తు చేసారు. పోలవరం డీపీఆర్ - 2 కి ఫైనాన్సు క్లియరెన్స్ రాలేదు, ఆర్అండ్ఆర్ ప్యాకేజి రాష్ట్రానికి సంబంధించింది అని కేంద్రం అంటుంది, ఇలాంటి కీలక విషయాల పై కేంద్రాన్ని ప్రశ్నించి నిధులు తెచ్చుకునే దమ్ము వాళ్ళకు లేదని అన్నారు. వీళ్ళ అసమర్ధత తెలిసే, ఇంకా పోలవరంలో ఏ పని జరగదు అని అర్ధమై, అక్కడ కాంట్రాక్టర్ లు, అక్కడ ఉన్న మెషినరీని మొత్తం తరలించేసరని చంద్రబాబు అన్నారు. నిన్న ఒక మంత్రి మాట్లాడుతూ, పట్టిసీమ నీళ్ళు అసలు ఉపయోగపడలేదని చెప్పారని, ఇది వీళ్ళకు ఉండే తెలివి అని అన్నారు. ఇవన్నీ వదిలేసి, నా పై పడ్డారని, వీళ్ళ నాన్న కూడా 26 ఎంక్వైరీలు నా పై వేస్తె, ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారని అన్నారు. ఇప్పుడు జగన్ కూడా అదే బాటలో, తన పై అర్ధంలేని అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, ఒక్కటి కూడా నిరూపించలేరని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read