ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే, తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్ కు ఎప్పుడూ చిన్న చూపే. ఉద్యమ సమయంలో కేసీఆర్, మనల్ని ఎన్ని తిట్టాడో అందరికీ గుర్తు ఉంది. తినే తిండి దగ్గర నుంచి, మన సాహిత్యం దాకా, అన్నిటికీ ఎగతాళి చేసారు. అయితే ఉద్యమ సమయంలో, ఉద్రేక పరిస్థితిలో చేసారులే అని సరి పెట్టుకున్నాం. కాని, రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత కూడా, ఆంధ్రప్రదేశ్ పై కక్ష కట్టాడు. ఆంధ్రప్రదేశ్ తో మీ రాష్ట్రం పోటీ పడుతుంది కదా, అని ఒక ఇంటర్వ్యూ లో అడిగితే, ఆంధ్రప్రదేశ్ ఒక థర్డ్ గ్రేడ్ స్టేట్, దాంతో మా రాష్ట్రాన్ని పోల్చకండి, అంటూ కేసిఆర్ చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తు ఉండే ఉంటాయి. అయితే, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి, చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు అనుకోండి, అది వేరే విషయం. మొన్న జరిగిన తెలంగాణా అసెంబ్లీ సమావేశంలో కూడా కేసీఆర్, అమరావతి పై తనకు ఉన్న అక్కసును కక్కారు.

kcr 12102019 2

అమరావతి అనేది ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్ అని, దాని పై ఎలాంటి ఖర్చు పెట్టవద్దు అని నేను చంద్రబాబుకి చెప్పాను అంటూ, ఒక కధ వినిపించారు. అయితే అదే అమరావతి శంకుస్థాపనకు వచ్చి, ఈ అమరావతికి భవిష్యత్తు ఉంది, హైదరాబాద్ అంత ఎదుగుతుంది, మేము వంద కోట్లు అమరావతికి ఇద్దాం అనుకున్నాం అని చెప్పిన విషయాలు అందరికీ గుర్తు ఉన్నాయి. అయితే అమరావతి ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పై, ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఉన్న ఎవరూ స్పందించలేదు. మన రాజధానిని కించపరుస్తున్నా, వీరికి చలనం లేదు. అయితే, కేసిఆర్, అమరావతిని డెడ్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు అంటూ, చేసిన వ్యాఖ్యల పై, చంద్రబాబు ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో స్పందించారు.

kcr 12102019 3

ఓపెన్ మ్యగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చంద్రబాబు స్పందిస్తూ, "కేసీఆర్, మా అమరావతిని డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు, ఆయనకు ఇలా అనటం చాలా ఈజీ. నేను 1995లో సియంగా ఉండగా, హైదరాబాద్ ని డెవలప్ చెయ్యటం, ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుని ఉంటె, ఈ రోజు తెలంగాణాకు ఇంత ఆదాయం వచ్చేదా ? హైదరాబాద్ ఆదాయంతోనే కదా తెలంగణా నడుస్తుంది. ఇప్పుడు కేసిఆర్ కు ఆ ఆదయమే కదా, ఫ్రీ గా పని చేసుకునేలా చేస్తుంది. నేను ప్రజల భవిష్యత్తు గురించి, తెలుగు రాష్ట్రాల ప్రగతి గురించి అలోచించి పని చేస్తున్నా. హైదరాబాద్ ఈ స్థాయిలో ఎదగడంలో నా పాత్ర ఉంది. అలాగే హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాగా, ఆంధ్రప్రదేశ్ కు కూడా, ఒక సిటీ కావాలని, అమరావతి ప్లాన్ చేసాం. కాని అమరావతిని అందరూ కలిసి, ఆదిలోనే చంపేస్తున్నారు" అంటూ చంద్రబాబు కేసీఆర్ వ్యాఖ్యల పై స్పందించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read