14 ఏళ్ళ క్రితం, లక్ష్మీపార్వతి, ఏసీబీ కోర్ట్ లో, చంద్రబాబు పై అక్రమ ఆస్థులు అంటూ వేసిన కేసు పై, స్టే లేదని, విచారణ కొనసాగించాలంటూ, నిన్న ఏసీబీ కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అయితే అప్పట్లో చంద్రబాబు, ఇది రాజకీయ పరమైన కేసు అంటూ, హైకోర్ట్ కు వెళ్ళటంతో, హైకోర్ట్ స్టే ఇచ్చింది. ఇప్పుడు ఆ స్టే రెన్యువల్ చేసుకోవటంలో జాప్యం కావటంతో, స్టే తొలగింది. ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ కోర్ట్ కు వెళ్లి, స్టే పొడిగించుకునే అవకాసం ఉంది. అయితే, ఇలాంటి కేసులు చంద్రబాబు పై అనేకం వచ్చాయి. 2014లో కూడా వైఎస్ విజయమ్మ, 2 వేల పేజీల అఫిడవిట్ వేసి, సుప్రీం కోర్ట్ లో కేసు వెయ్యటంతో, సుప్రీం కోర్ట్, ఇదేమిటి అంటూ కొట్టేసింది. లక్ష్మీపార్వతి కేసు కూడా అలాంటిదే అయినా, ఏదో జరిగిపోతుంది అంటూ, చంద్రబాబు జైలుకు వెళ్ళిపోతారు అంటూ, వైసిపీ హడావిడి చేస్తుంది. నిజానికి అది ఒక చిన్న సాంకేతిక అంశం. అయినా, హడావిడి చేస్తూ ఉండటంతో, సోషల్ మీడియాలో హడావిడి నెలకొంది.

cbn 191112019 2

అయితే ఈ విషయం పై, ఈ రోజు చంద్రబాబు మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు, అక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంలో, విలేఖరులు ఈ ప్రశ్న అడిగారు. లక్ష్మీ పార్వతి గారు పెట్టిన కేసులు, ఏసీబీ కోర్ట్ లో స్టే లేకపోవటంతో, ఆ కేసులో విచారణ ప్రారంభం అయ్యింది, దీని పై మీ స్పందన ఏంటి అని విలేఖరులు అడగగా, చంద్రబాబు సింపుల్ గా తీసి పడేసారు. ఇదేమి పెద్ద కేసు కాదు, ఈ విషయం మా లాయర్లు చూసుకుంటారు. ఇదేమంత పెద్ద విషయం కాదు, ఇలాంటివి నా మీద 29 కేసులు పెట్టారు, ఒక్కటి కూడా నిరూపించ లేకపోయారు, ఇలాంటివి వస్తూనే ఉంటాయి, మా లాయర్లు చూసుకుంటారు అంటూ, ఒక్క ముక్కలో తీసి పడేసారు.

cbn 191112019 3

ఒక పక్క వైసిపీ ఏదో జరిగిపోతుంది అంటూ హడావిడి చేస్తుంటే, చంద్రబాబు మాత్రం, ఒక్క ముక్కలో, ఇదేమంత విషయం కాదు అంటూ, లాయర్లు చూసుకుంటారు అంటూ తీసి పడేసారు. అలాగే రాష్ట్రంలో జరుగతున్న సమస్యల పై స్పందిస్తూ, "పోలీసులు ఉన్నది.. కేసులు పెట్టాలని చెప్పడానికి కాదు, వచ్చిన కేసులను విచారణ చేసి న్యాయం చేయడం పోలీసుల విధి. వారానికి ముందుగా సమాచారం ఇస్తే అనుమతి ఎందుకు ఇవ్వరు. తణుకులో నా కాన్వాయ్‌కి సైతం పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కావాలనే అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారు. నేను బహిరంగ సభకు రాలేదే.. సెక్యూరిటీ నెపంతో అనుమతి ఇవ్వకుండా ఆపారు. పోలీసు 30 యాక్టు పేరుతో టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు. తణుకులో టీడీపీ కార్యకర్తలు రాకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు" అంటూ చంద్రబాబు పోలీసుల పై విమర్శలు చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read