గత నాలుగు అయిదు రోజులుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అన్ని విషయాలు పక్కకు వెళ్లి, పరుష పదజాలంతో, నేతలు మాట్లాడిన మాటలు హైలైట్ అయ్యాయి. చంద్రబాబు ఇసుక దీక్ష చేసే ముందు రోజు దాకా, సాదా సీదాగా సాగిన రాజకీయం, చంద్రబాబు చేసిన ఇసుక దీక్షతో వేడెక్కింది. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల తరుపున చంద్రబాబు పోరాటం చెయ్యటంతో, సహజంగానే రాజకీయం వేడెక్కింది. అయితే, వైసీపీ వైపు నుంచి మాత్రం, అనూహ్యంగా, వేరే స్ట్రాటజీతో ముందుకు రావటంతో, ఇసుక దీక్ష పక్కకు వెళ్ళిపోయింది. వార్తలు నిండా వైసిపీకి చెందిన వార్తలు వచ్చేలా వాతవరణం వచ్చింది. చంద్రబాబు దీక్ష చేసే రోజు నాలుగు గంటలకు, దేవినేని అవినాష్, జగన్ సమక్షంలో వైసీపీలో చేరగా, అయుదు గంటలకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, తన భవిష్యత్తు రాజకీయ అడుగుల పై ప్రెస్ మీట్ పెట్టారు. అయితే అవినాష్ సైలెంట్ గా ఒక నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోగా, వల్లభనేని వంశీ మాత్రం, విమర్శలతో చంద్రబాబు పై ఎదురు దాడి చేసారు.

cbn 19112019 2

ప్రెస్ మీట్ తరువాత, వంశీ వివిధ టీవీ ఛానెల్స్ లో మాట్లాడిన చర్చల్లో, అవి బూతులు దాకా వెళ్ళిపోయాయి. రెండు రోజుల తరువాత వంశీ, వైవీబీకి క్షమాపణ చెప్పినా, ఆయన పరుష పదజాలంతో, చంద్రబాబు పై మాట్లాడటం అందరూ చూసారు. ఇక తరువాత, గుడివాడ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని కూడా, వరుసుగా రెండు రోజులు చంద్రబాబు పై, దేవినేని ఉమా పై బూతులతో, వ్యక్తిగత విమర్శలతో విరుచుకు పడ్డారు. ఒక పక్క వంశీ మాల వేసుకుని అలా మాట్లాడటం, కొడాలి నాని తిరుమల పై చేసిన వ్యాఖ్యలతో వాతవరణం వేడెక్కింది. ఈ వ్యాఖ్యల పై తెలుగుదేశం పార్టీ నేతలు కూడా, ప్రెస్ మీట్ లు పెట్టి ఖండించారు. కొంచెం సంస్కారంతో, రాజకీయాలు చెయ్యాలని హితవు పలికారు. హిందూ సంప్రాదాయాన్ని గౌరవించాలని అన్నారు.

cbn 19112019 3

అయితే మళ్ళీ దీని పై వంశీ స్పందించటం, ఇలా జరుగుతూ ఉంది. అయితే, ఈ రోజు ఈ పరుష పదజాలం పై చంద్రబాబు ఒకే ఒక్క ముక్కతో వారి మాటలకు స్పందించారు. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో కొంత మంది విలేఖరులు, వంశీ, నాని మాట్లాడిన మాటల పై, అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ, "బూతులు తిట్టటం కష్టం కాదు, నిగ్రహం పాటించటమే కష్టం.. అదే తెలుగుదేశం పార్టీ చేస్తుంది.. బూతులు మాట్లాడటం మాకు చేతకాక కాదు. మేము అలా మాట్లాడటం మొదలు పెడితే, టీవీలు కూడా చూడలేరు. కాని, మేము క్రమశిక్షణతో ముందుకు వెళ్తాం, ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు" అంటూ ఒక్క మాటలో చంద్రబాబు, వారి మాటలకు స్పందించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read