ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబు వేసిన సెటైర్ కు, ఆర్ధిక మంత్రి బుగ్గన కూడా నవ్వుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కియా మోటార్స్ కంపెనీ పెట్టారంటే, అది ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్లే అంటూ, మరోసారి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి చెప్పుకొచ్చారు. నిన్నటి లెటర్ మళ్ళీ చదువుతూ, కియా ప్రెసిడెంట్, స్వయంగా, ఉత్తరం రాసారని, రాష్ట్రంలోనే అతి పెద్ద రెడ్డి ఇంటి పేరు ఉన్న మీరు అంటూ జగన్ ని సంభోదించి, లేఖ రాసారని, ఆనాడు వైఎస్ఆర్ ప్రాజెక్ట్ పెట్టమంటేనే, ఈ రోజు పెట్టుబడి పెట్టామని కియా ప్రెసిడెంట్ లెటర్ లో రాసారని చెప్పారు. బుగ్గన వ్యాఖ్యల పై చంద్రబాబు స్పందించారు. నవ్వుతూ నవ్వుతూనే బుగ్గనకు కౌంటర్ లు ఇచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ, బుగ్గన రాజేంద్రరెడ్డి గారూ, ఎంతో తెలివిగా మాట్లాడుతున్నారు. మీకు హ్యాట్సాఫ్ చెప్పాలి, మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నా అంటూ కియా విషయం పై చంద్రబాబు పంచ్ లు వేసారు.

2009లోనే రాజశేఖరెడ్డి గారు చనిపోతే, ఆయన ఆత్మ కియా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లి, 2016లో మీరు చంద్రబాబు దగ్గరకెళ్లండి, అయన అన్ని ఇన్సెంటివ్స్ ఇస్తారు, కియా అనంతపురంలో పెట్టండి అని వైఎస్ చెప్పారట. వైఎస్ చెప్పబట్టే కియా వచ్చి ఇక్కడ పెట్టారంట. ఎంత బాగా కధ చెపారు, మీరు ఎంతో గొప్ప నాయకులు, ఇలాంటి అబద్ధాలు కూడా అవలీలగా చెప్పేసి, నిజం అని నమ్మిస్తారు, మిమ్మల్ని ఈ విషయంలో, అభినందిస్తున్నా, మీకు కంగ్రాజ్యులేషన్స్ అని చంద్రబాబు అన్నారు. దీని పై బుగ్గన మాట్లాడుతూ, చంద్రబాబు నన్ను తెలివైన వారు అన్నారు, చాలా సంతోషం , కాని ఈ ఉత్తరం మాత్రం నిజమే కదా అంటూ, మళ్ళీ అదే విషయం చెప్పుకొచ్చారు. మొత్తానికి, ఈ తరానికి, కియా మోటార్స్ కంపెనీ కేవలం ఆ రోజు వైఎస్ఆర్ చెప్పటం వల్లే వచ్చిందని, చెప్పేందుకు వైఎస్ఆర్ పార్టీ ఆడుతున్న ఆటను ప్రజలు గమనిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read