రేపటి అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై సోమవారం మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో టిడిపి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘ రేపటి అసెంబ్లీ అజెండాయే రాజ్యాంగ విరుద్దం. ఒక సభ గురించి మరో సభలో చర్చించడం పార్లమెంటరీ ప్రాక్టీసెస్ కు విరుద్దం, ఇది ఒక రకంగా రాజ్యాంగ వ్యవస్థలను కించపర్చడం. ఇప్పటికే అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డారు. రేపటి అసెంబ్లీలో మరో ఉల్లంఘనకు తెరదీశారు. కౌన్సిల్ గురించి మొన్న అసెంబ్లీలో చర్చించడమే ఒక ఉల్లంఘన కాగా, రేపు మళ్లీ చర్చిస్తామన్న అసెంబ్లీ అజెండా మరో ఉల్లంఘన. ఒక తప్పుకాదు, తప్పు మీద తప్పులు చేస్తున్నారు. దురుద్దేశాలతోనే ఈ విధంగా చేస్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్సీలను లాక్కున్నారు, ఇద్దరు ఎమ్మెల్యేలను లాక్కున్నారు. ప్రలోభాలు-బెదిరింపులు, అక్రమ కేసులతో వేధిస్తున్నారు. 22మంది మంత్రులంతా వచ్చి ఛైర్ పర్సన్ పై దౌర్జన్యానికి దిగారు, కులం, మతం పేరుతో దూషించారు, మనవళ్ల పేరుతో బెదిరించారు. కౌన్సిల్ లో మంత్రుల వల్గర్ బిహేవియర్ రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చింది. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మంత్రులు ఈ స్థాయిలో దుష్ప్రవర్తన గతంలో ఎప్పుడూ లేదు. మంత్రులు పోడియం బల్లలు ఎక్కడం, బాటిల్స్ విసిరేయడం, పేపర్లు చించి ఛైర్ పర్సన్ పై విసిరేయడం, కొట్టడానికి టిడిపి ఎమ్మెల్సీలపైకి రావడం, ఛైర్ పర్సన్ పై దాడికి పాల్పడటం, దుర్భాషలాడటం ఎక్కడా చూడలేదు’’ అని ఆవేదన చెందారు.


టడిపి ఎమ్మెల్సీలను ఉద్దేశించి మాట్లాడుతూ, ‘‘ మున్నెన్నడూ లేనంత ఇమేజి పార్టీకి మీ వల్ల వచ్చింది. నాయకుడిగా నా ఇమేజిని మరింత పెంచారని’’ అన్నారు. ఇప్పుడు ఏ చొరవ చూపారో అదే స్ఫూర్తి ఇకపై కూడా చూపాలని, పార్టీ అధ్యక్షుడిగా మీకు అన్నివిధాలా అండగా ఉంటానని పేర్కొన్నారు. అసెంబ్లీ ఈయన (సీఎం జగన్) చెప్పినట్లు జరగాలి.. మెజారిటి లేకపోయినా కౌన్సిల్ కూడా ఈయన చెప్పినట్లే జరగాలంటారు.. పెడ ధోరణులతో రాష్ట్రాన్ని పతనం చేస్తున్నారు. అక్కడ(అసెంబ్లీలో) స్పీకర్ విచక్షణాధికారం ఉపయోగించడం కరెక్ట్ అంటారు, ఇక్కడ(కౌన్సిల్ లో) ఛైర్ పర్సన్ విచక్షణాధికారం ఉపయోగించడం కరెక్ట్ కాదంటారు. అసెంబ్లీలో రింగు గీసి, అది దాటివచ్చిన వాళ్లను బైట పడేయమంటారు మార్షల్స్ తో..అదే కౌన్సిల్ లో వైసిపి మంత్రులే పోడియం బల్లలెక్కినా వాళ్లను అడ్డుకోరు మార్షల్స్..తన రూమ్ లో కరెంట్ కట్ చేస్తే, టివి ఆపేస్తే, ఇంటర్నెట్ బంద్ చేస్తే, కౌన్సిల్ గ్యాలరీకి వెళ్లిన మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేతను బైటకు వెళ్లమని అంటారు. శాసన మండలి ఇప్పటివరకు అనేక బిల్లులను ఆమోదించి పంపింది. 3 రాజధానులపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత, 13జిల్లాల్లో జరుగుతున్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకునే ఈ 2 బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపింది. ప్రభుత్వ విధానం ప్రజాకాంక్షలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టే, రూల్ 71 ద్వారా ఆ పాలసీకి అననుకూలంగా శాసన మండలి తీర్మానించింది.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు, ప్రజల ఆకాంక్షలను నిలబెట్టేందుకు ఎమ్మెల్సీలు దృఢంగా నిలబడ్డారు. మంత్రుల దుర్భాషలను, దౌర్జన్యాలను ప్రతిఘటించారని’’ చంద్రబాబు ప్రశంసించారు.

"స్వయంగా వైఎస్ లోక్ సభ గ్యాలరీలో కూర్చుని ఎంపిల కొనుగోళ్లకు పాల్పడ్డారు. తనకు డబ్బు లేకపోయినా కేరక్టర్ ఉందని చలపతిరావు అప్పట్లో ధీటుగా జవాబిచ్చి పార్టీ కోసం ధృఢంగా నిలబడ్డారు. అదే స్ఫూర్తితో ఎమ్మెల్సీగా ఇప్పుడు కూడా పార్టీ కోసం ధీటుగా నిలబడ్డారు. ప్రలోభాలను తట్టుకుని, బెదిరింపులను ఎదుర్కొని పార్టీ కోసం నిలబడ్డ ఎమ్మెల్సీలంతా హీరోలు. ఏ పరిస్థితుల్లో పోతుల సునీతకు ఎమ్మెల్సీ ఇచ్చామో ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. ‘‘పరిటాల రవి అనుచరులుగా అండర్ గ్రవుండ్ లో కష్టాలు పడ్డారనే చమన్, పోతుల సురేష్ లను టిడిపి అధికారంలోకి రాగానే గౌరవించాం. సీతక్క, పోతుల సునీత ప్రజా క్షేత్రంలోకి రాగానే ఎన్నికల్లో టిక్కెట్లిచ్చి ప్రోత్సహించాం. సునీతకు జడ్ పిటిసి ఇచ్చాం. ఆలంపూర్ లో, చీరాలలో టిక్కెట్టిచ్చినా ఓడిపోయింది. అయినా ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించాం, టిడిపి మహిళా అధ్యక్షురాలిని చేశాం. ఇన్నివిధాలా గౌరవించినా ఆమె వెళ్లిపోవడం బాధాకరం. ఇది ముందే తెలిసి భార్యాభర్తలను పిలిచి మాట్లాడినా వెళ్లిపోయారు. తమపై దౌర్జన్యాలను వివరించిన బిటి నాయుడు, బుద్దా నాగ జగదీశ్వర రావు హైదరాబాద్ లో ‘దిశ’పై జరిగినట్లే, అమరావతిపై వైసిపి నేతలు అఘాయిత్యం చేశారన్న తన వ్యాఖ్యలతో కక్షకట్టిన మంత్రి బుగ్గన తన ఇంటిపైకి 50మందిని దాడికి పంపారని బిటి నాయుడు చెప్పారు.

ఎమ్మెల్సీ ఇంటిపై దాడిచేసిన వాళ్లపై కేసు పెట్టాలని కోరినా, బాధితులపైనే అక్రమ కేసులు కట్టారని తెలిపారు. మీ(చంద్రబాబు) అండతో ఇటువంటి దాడులు ఎన్నైనా ఎదుర్కోడానికి సిద్దంగా ఉన్నామని బిటి నాయుడు చెప్పారు. అనకాపల్లిలో తమ కోల్డ్ స్టోరేజిని సీజ్ చేశారని, అందులో రైతులు నిల్వచేసిన ఉత్పత్తులు తీసుకెళ్లేందుకు కూడా అనుమతించ లేదని బుద్దా నాగ జగదీశ్వర రావు తెలిపారు. ఆర్ధిక మూలాలు దెబ్బకొట్టాలని వైసిపి చేస్తున్న దుష్ప్రయత్నాలను ప్రజాకోర్టులోనే ఎండగడతాం అంటూ, ళ్ల బెదిరింపులకు భయపడేది లేదన్నారు.
తెనాలిలో జెఏసి దీక్ష శిబిరానికి నిప్పుపెట్టడం, మహిళలను భయభ్రాంతులను చేయడం, టిడిపి ముస్లిం నేత ఖుద్దూస్ పై దాడి చేయడాన్ని ఎమ్మెల్సీలు అంతా ఖండించారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ,‘‘ ప్రశాంతంగా ఉండే కుప్పం నియోజకవర్గంలో కూడా దాడులకు పాల్పడ్డారు. అక్కడి ప్రజలు హింసావిధ్వంసాలను సహించరు. అలాంటిది ద్రవిడ విశ్వవిద్యాలయం వద్ద కొందరిని రెచ్చగొట్టి టిడిపి నాయకులపై దాడులు చేసి గాయపర్చడం హేయం’’గా ధ్వజమెత్తారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read