తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతికి స్వల్ప గాయం అయినట్టు తెలుస్తుంది. ఆయన చేతికి కట్టుతోనే ఈ రోజు తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గున్నారు. అయితే చంద్రబాబు చేతికి కట్టు చూసి, నాయకులు అందరూ ఏమైందో అని అందరినీ అడగటం మొదలు పెట్టారు. అయితే ఆయన కుడిచేతి నరం పై ఒత్తిడి పెరగటంతో, అది ఇబ్బంది పెట్టటంతో, వైద్యులు కట్టుకట్టినట్టు తెలుస్తుంది. నరం బాగా ఇబ్బంది పెట్టటంతో, ఒత్తిడి పడకుండా, కట్టు కట్టారని తెలుస్తుంది. దీంతో చిన్న ఇబ్బంది మాత్రమే అని తెలియటంతో నాయకులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. చంద్రబాబు మీద నక్సల్స్ దాడి జరగిన సమయంలోనే ఆయన చేతికి కట్టు చూసామని, చివరకు పాదయాత్రలో కూడా ఇలాంటి దృశ్యాలు చూడలేదని, అందుకే కంగారు పడ్డామని నాయకులు అన్నారు.

cbn 163082019 2

మరో పక్క తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు, నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం అని, కాని ఈ సారి ఎంతో కష్టపడి ప్రజలకు పనులు చేసినా, ఓడిపోయామనే బాధ వెంటాడటం సహజం అని, ఇక మనం ఈ మూడ్ లో నుంచి బయటకు వచ్చి, ప్రజల తరుపున పోరాడాలని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, చేస్తున్న దాడులతో తెలుగుదేశం శ్రేణులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఆస్థులు ధ్వంసం చేస్తున్నారని, వారికి అండగా నిలవాలని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే, తిరిగి మన పైనే కేసులు పెడుతున్నారని అన్నారు. 2014లో వైసీపీ ఓడిపోయినప్పుడు, మనం అధికారంలో ఉండగా, ఆ పార్టీ నేతలు రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగలేదా అని చంద్రబాబు ప్రశ్నించారు.

cbn 163082019 3

పోలీసులు కూడా గత ప్రభుత్వంలో ఎలా పని చేసారు, ఇప్పుడు ఎలా పని చేస్తున్నారో పోలీసులు పరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. చేతికి కట్టుతోనే చంద్రబాబు దాదాపు గంటకు పైగా ప్రసంగించారు. ఇది ఇలా ఉంటే, చంద్రబాబు 15 రోజుల క్రిందట అమెరికా వెళ్లి హెల్త్ చెక్ అప్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రతి రెండేళ్లకు చంద్రబాబు అమెరికా వెళ్లి పరీక్షలు చేయించుకుంటారు. అయితే ఈ సారి పరీక్షల్లో ఎప్పటికి మీద, రిపోర్ట్స్ బాగున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. చంద్రబాబు అమెరికాలో హుషారుగా పాప కార్న్ తింటూ రోడ్ల మీద తిరిగటం చూస్తూనే, ఆయన ఎంత ఆరోగ్యంగా హుషారుగా ఉన్నారో తెలుస్తుందని, పార్టీ వర్గాలు అంటున్నాయి.

Advertisements

Add comment


Security code
Refresh

Advertisements

Latest Articles

Most Read