“ప్రజా రాజధాని అమరావతి” ఉపాధి కల్పన-సంపద సృష్టి-పేదరిక నిర్మూలన అంశం పై విజయవాడలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఈ రోజు జరిగింది. టీడీపీ ఆధ్వర్యంలో సమావేశానికి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, లాయర్లు , డాక్టర్లు , క్రెడాయ్ ,వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు , జర్నలిస్ట్ సంఘాలు, కాన్వెంట్స్ అసోసియేషన్ , ఉపాధ్యాయ సంఘాలు, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ , ఛాంబర్ అఫ్ కామర్స్, రైతు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా, “అమరావతిని కాపాడండి” "సేవ్ అమరావతి" అంటూ సిగ్నేచర్ బోర్డు పై చంద్రబాబు సంతకం చేసారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతిలో నేలలకు పటుత్వం తక్కువ అని దుష్ప్రచారం చేశారని, అమరావతిలో చ.మీ కు 150టన్నుల బేరింగ్ కెపాసిటి ఉందని, అదే చెన్నైలో చ.మీ కు 10టన్నుల బేరింగ్ కెపాసిటి మాత్రమే ఉందని అన్నారు. హైదరాబాద్ లో రాతినేలలకు బ్లాస్టింగ్ ఖర్చు, రవాణా ఖర్చు ఎక్కువని, అమరావతి పునాదులకు ఖర్చు ఎక్కువ అనేది అవాస్తవం అని చంద్రబాబు అన్నారు.

amaravatii 05122019 2

"సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతిని అభివృద్ది చేశాం: అమరావతిలో భవిష్యత్ అవసరాల కోసం ఉంచిన భూమి: 5,020 ఎకరాలు, నగరాభివృద్ధికి కేటాయించిన భూమి : 3,019 ఎకరాలు, మొత్తం : 8,039 ఎకరాలు, ఈ భూమి విలువ రూ. లక్ష కోట్లు. భవిష్యత్తులో ఇది రూ.2లక్షల కోట్లకు పైగా పెరుగుతుంది. రాజధాని నిర్మాణాలు పూర్తిగా రాజధాని భూముల డబ్బుతోనే నిర్మించేవిధంగా ప్లాన్ చేశారు. ఇక్కడ వచ్చే ఆదాయం రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధికి ఉపయోగించవచ్చు. పశ్చిమ బెంగాల్ ఆదాయంలో కోల్ కత్తా నుంచే 76%, తెలంగాణ ఆదాయంలో హైదరాబాద్ నుంచే 60%, ఒడిశా ఆదాయంలో భువనేశ్వర్ నుంచే 56%, కర్ణాటక ఆదాయంలో బెంగుళూరు నుంచే 40%, తమిళనాడు ఆదాయంలో చెన్నై నుంచే 39% ఉంది."

amaravatii 05122019 3

"త్యాగం చేసిన రైతులు, పేదలకు లబ్ధి: ఫిబ్రవరి 28, 2015 వరకు 58రోజుల్లో 33 వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ల్యాండ్‌పూలింగ్‌కు ఇవ్వడం ఓ ప్రపంచ రికార్డ్. మన ల్యాండ్ పూలింగ్‌ను హార్వార్డ్ యూనివర్సిటీ కేస్ స్టడీగా తీసుకుంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అధ్యయనం చేసి ప్రశంసించింది. భూములు ఇచ్చిన రైతులకు 27 గ్రామాల్లో పబ్లిక్‌ లాటరీ ద్వారా 63,410 ప్లాట్లు. రైతు రుణాల రద్దులో భాగంగా రాజధాని పరిధి గ్రామాలలోని 19,518 మంది రైతులకు చెందిన రూ.85.35 కోట్ల రుణాలను ఒకేసారి రద్దు చేశారు. ఒక్కో రైతుకు రూ.1.5 లక్షల వరకు రద్దు చేశారు. మెట్ట భూములకు ఏడాదికి రూ. 30 వేలు, జరీబు భూములకు రూ. 50 వేలు కౌలు ఇచ్చాం. భూమి లేని రైతు కూలీలకు నెలకు రూ.2,500 పింఛను ఇచ్చాం. దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదల అసైన్ మెంట్ భూములకు రిజిస్ట్రేషన్ హక్కు కల్పించడమైనది. రాజధాని 29 గ్రామాల్లో ఇళ్లు లేని పేదలందరికీ 5 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం. 28,538 మంది రైతుల నుంచి 34,395.50 ఎకరాల సమీకరణ. ఇప్పటి వరకు చరిత్రలో ప్రజావసరాలకు భూమిని రైతుల నుంచి బలవంతంగా గానీ, స్వచ్ఛందంగా గానీ సేకరించారు."

Advertisements

Advertisements

Latest Articles

Most Read