రేణిగుంట విమానశ్రయంలో ఉదయం నుంచి చంద్రబాబు నిరసన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సమయం గడుస్తున్న కొద్దీ ఏమి జరుగుతుందా అనే టెన్షన్ నెలకొంటు వస్తుంది. కొద్ది సేపటి క్రితం తిరుపతి ఎస్పీ కూడా వచ్చి చంద్రబాబుతో చర్చలు జరిపారు. మధ్యానం 3.10కి చంద్రబాబుని పంపించి వేయాలని ప్రయత్నం చేసినా, విమానంలో అప్పటికే అన్ని టికెట్స్ బుక్ అయిపోయి ఉండటంతో, అది విరమించుకున్నారు. ఈ నేపధ్యంలోనే రేణిగుంట విమానశ్రయంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఏమి జరుగుతుందో అర్ధం కాక, అక్కడ ఉద్రిక్త వాతవరణం పెరిగిపోతుంది. చంద్రబాబు బయటకు వస్తారని, మీడియాతో మాట్లాడతారని సమాచారం రావటంతో, అందరూ అరైవల్ బ్లాక్ దగ్గర వచ్చి నిలబడ్డారు. చంద్రబాబుకు సెక్యూరిటీగా ఉండే బ్లాక్ క్యాట్ కమెండోలు కూడా అక్కడకు చేరుకున్నారు. అంతే కాకుండా, చంద్రబాబు కాన్వాయ్ కూడా రెడీ చేసారు. అయితే చంద్రబాబు బయటకు వస్తారని, చిత్తూరు వెళ్తారని లీక్ ఇచ్చారు. దీంతో అందరూ చంద్రబాబు ఎప్పుడు వస్తారా అని చూస్తున్నారు. అయితే చంద్రబాబు ఎంత సేపటికి బయటకు రాకపోవటంతో, గందరగోళం నెలకొంది. అయితే అసలు ఏమైంది అని ఆరా తీయాగా, పోలీసులు వ్యూహాత్మికంగా ఇలా చేసారని అర్ధం అవుతుంది.

ఒక పక్క ఇలా ఏర్పాట్లు చేస్తూనే, చంద్రబాబుని బలవంతంగా మరో ఫ్లైట్ ఎక్కించటానికి ప్రయత్నాలు జరుగుతున్నయనే సమాచారం వచ్చింది. ట్రూజెట్ తో పాటుగా, ఇండిగో, స్పైస్ జెట్ విమానాల్లో చంద్రబాబు తిరుగు ప్రయాణానికి పోలీసులు టికెట్ ను బుక్ చేసారు. అయితే ఇప్పటికే స్పైస్ జెట్ విమానంవెళ్ళిపోయింది. రన్ వేపై ఇండిగో విమానం సిద్ధంగా ఉండటంతో, చంద్రబాబుని ఆ విమానంలో పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం, వెళ్ళేది లేదని, తన కార్యక్రమంలో పాల్గుని వెళ్తానని అన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబుని బయటకు వాడులుతారా, లేదా బయటకు పంపించి మధ్యలో అడ్డుకుంటారా, లేక ఎయిర్ పోర్ట్ లోనే ఉంచి, అటు నుంచి అటు పంపించేస్తారా అనేది, ఈ మూడు విషయాల్లో ఏది జరుగుతుంది అనేది ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది. మొత్తంగా మళ్ళీ ఎయిర్ పోర్ట్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరి పోలీసులు ఏమి చేస్తారు ? చంద్రబాబుని ఎలా ఒప్పిస్తారు ? లేదా బలవంతంగా లిఫ్ట్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read