తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్ళారు. ఈరోజు మధ్యాహ్నం 12.30కి రాష్ట్రపతి అపాయింట్‍మెంట్ ఇవ్వటంతో, చంద్రబాబు ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ పయనం అయ్యారు. చంద్రబాబు రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. ఇప్పటికే సీనియర్ నేతలు అందరూ ఢిల్లీ చేరుకున్నారు. చంద్రబాబు వెంట సోమిరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, టీడీ జనార్ధన్, అనగాని, బీసీ జనార్ధన్ రెడ్డి ఢిల్లీ బయలు దేరారు. బెంగళూరు నుంచి  కాలువ శ్రీనివాసులు వెళ్లనున్నారు. విశాఖ నుంచి ఢిల్లీ బయల్దేరిన అచ్చెన్నాయుడు, వంగపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, విజయవాడ నుంచి ఢిల్లీ బయల్దేరిన యనమల, కేశినేని, నక్కా ఆనంద్‍బాబు, వర్ల రామయ్య, షరీఫ్, నిమ్మల రామానాయుడు ఢిల్లీ వెళ్లారు. ప్రధానంగా టిడిపి కార్యాలయం పై దా-డి, పట్టాభి ఇంటి పై దా-డి, అలాగే రాష్ట్రంలో విచ్చలవిడిగా లభ్యం అవుతున్న గంజాయి, డ్ర-గ్స్ పైన ఫిర్యాదు చేయనున్నారు. అంతే కాకుండా, ఈ రెండున్నర ఏళ్ళలో, రాష్ట్రంలో జరిగిన అనేక రాజ్యాంగ విరుద్ధమైన పనుల పై కూడా రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు. ఇవన్నీ చేసి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చంద్రబాబు కోరనున్నారు. రాష్ట్రపతితో భేటీ తరువాత చంద్రబాబు అమిత్ షా ని కూడా కలిసే అవకాసం ఉంది.

delhi 25102021 2

అమిత్ షా గత మూడు రోజులుగా కాశ్మీర్ లో ఉన్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో అందుబాటులో ఉంటారు. ఆయన సమయాన్ని బట్టి, అపాయింట్మెంట్ లభించే అవకాసం ఉన్నట్టు టిడిపి నేతలు చెప్తున్నారు. ఇతర నేతలను ఎవరిని కలుస్తారు అనేది చూడాల్సి ఉంది. ఎన్నికల తరువాత చంద్రబాబు ఢిల్లీ వెళ్ళలేదు. మరి ఈ భేటీలో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో కూడా చూడాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపధ్యంలో, ఎప్పుడూ లేని విధంగా టిడిపి ఆఫీస్ పై, పట్టాభి ఇంటి పై దా-డి చేసిన వారిని గుర్తించి, వారి పై కేసులు పెట్టమని, నోటీసులు ఇచ్చామని, అరెస్ట్ లు చేస్తున్నామని హడావిడి చేస్తున్నారు. అయితే ఇదంతా కేవలం చంద్రబాబు పర్యటన నేపధ్యంలో, ఢిల్లీ నుంచి వివరాలు అడిగితే ఇవి చూపించటానికే మత్రమే చేస్తున్న పనులు అని టిడిపి ఆరోపిస్తుంది. గతంలో ఎన్నో జరిగాయని, ఏకంగా బాబు ఇంటి మీద దా-డి చేసినా ఏమి చేయలేదని, ఇప్పుడు కేవలం ఢిల్లీ పర్యటన నేపధ్యంలో హడావిడి చేస్తున్నారని టిడిపి ఆరోపిస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read