తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. చాలా రోజుల తరువాత, మారిన రాజకీయ సమీకరణల నేపధ్యంలో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. అయితే ఇది రాజకీయ పర్యటన కాదు. కేంద్ర మాజీమంత్రి, భాజపా సీనియర్‌ నేత అరుణ్‌జైట్లీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించటానికి ఢిల్లీ వెళ్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తారు. అయితే ఆ కార్యక్రమం చూసుకుని వచ్చేస్తారా ? లేక ఇంకేమైనా రాజకీయ పరమైన భేటీలు ఉంటాయా అనేది తెలియాల్సి ఉంది. అయితే పార్టీ వర్గాలు మాత్రం, కేవలం అరుణ్‌జైట్లీ భౌతికకాయానికి నివాళులు అర్పించటానికే వెళ్తున్నారని, మరే రకమైన రాజకీయ భేటీలు ఉండవని చెప్తున్నారు. బీజేపీ నాయకులతో చంద్రబాబుకి సన్నిహిత సంబంధాలు ఉన్న నేపధ్యంలో, వారితో భేటీ అవుతారో లేదో చూడాలి.

delhi 25082019 2

అరుణ్ జైట్లీ నిన్న మరణించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వాలో ఆర్థిక, రక్షణ, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వచించిన జైట్లీ, శనివారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఎయిమ్స్‌ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడారు. నిన్న పరిస్థితి క్షీణించటంతో, శాశ్వత నిద్రలోకి వెళిపోయారు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న జైట్లీ ఆరోగ్య పరిస్థితి శుక్రవారమే విషమించింది. ఈ వార్తా తెలియటంతోనే, బీజేపీ ముఖ్యనేతలందరూ ఆయన్ను పరామర్శించటానికి, ఎయిమ్స్‌కు వచ్చారు. ఆరోగ్యం క్షీణించటంతో శనివారం మధ్యాహ్నం ఆయన మరణ వార్త వెలువడింది. భారత రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌, బీజేపీ అగ్రనేతలు ఎయిమ్స్ కు వచ్చి జైట్లీకి నివాళులు అర్పించారు. అనంతరం జైట్లీ భౌతిక కాయాన్ని ఆయన నివాసానికి తరలించారు.

delhi 25082019 3

అరుణ్ జైట్లీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా మంచి అనుబంధమే ఉంది. కాకపోతే ఆయన చేసిన కొన్ని ప్రకటనలు, ప్రజల ఆగ్రహం కూడా తెప్పించిన సందర్భాలు ఉన్నాయి. ఇది పక్కన పెడితే, జైట్లీ, 2014లో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో, విభజన బిల్లు చర్చకు వచ్చిన సమయంలో, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరుపున పోరాడారు. తరువాత, అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం, ఆ హామీలను పట్టించుకోలేదు అనుకోండి, అది వేరే విషయం. అయితే జైట్లీ అమరావతి విషయంలో మాత్రం, మంచి చేసారు. రాజధాని రైతులకు క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ నుంచి రెండేళ్ల పాటు మినహాయింపు ఇవ్వడం వంటి అంశాల్లో ఆయన ఆర్ధిక మంత్రిగా ఉన్న సమయంలో ప్రముఖ పాత్ర నిర్వహించారు. ఇక అమరావతిలో కొన్ని భవనాల శంకుస్థాపన ఆయన చేతుల మీదుగానే జరిగింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read