గత 5 ఏళ్ళులో, ప్రభుత్వ నిర్ణయాలు అన్నిటి పై, సిట్ వేస్తూ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇంటెలిజెన్స్‌ డీఐజీ కొల్లి రఘురాంరెడ్డి నేతృత్వంలో 10 మంది పోలీస్ సభ్యులతో, ఈ సిట్ వెయ్యటం పై, అందరూ ఆశ్చర్యపోయారు. గత ప్రభుత్వ నిర్ణయాలు అన్నిటి పై, సిట్‌ ఏర్పాటు చేయడం దేశంలోనే మొదటి సారి అని, అదీ కాక, పోలీసులతో, ఇలాంటివి విచారణ ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. సిట్ కు అధికారాలు ఇస్తూ, ఎవరిని అయినా ప్రశ్నించే అవకాసం ఇవ్వటం, ఎవరిని అయినా అరెస్ట్ చేసే అధికారం ఇవ్వటం చూస్తుంటే, ఇది కచ్చితంగా కక్ష సాధింపు వ్యవహారమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే, సిట్ ఏర్పాటు పై చంద్రబాబు మొదటి సారి స్పందించారు. తన ట్విట్టర్ వేదికగా, ఈ నిర్ణయం పై స్పందించారు. ఇది చంద్రబాబు ట్వీట్... "ఈ ప్రభుత్వానికి నా మీద, తెలుగుదేశం పార్టీ మీద ఎంత కక్ష ఉందో చెప్పడానికి మా ఐదేళ్ళ పాలన మీద నిన్న వేసిన సిట్ మరో ఉదాహరణ. ఇదేమీ కొత్తకాదు. 9 నెలల్లో 3 సిట్ లు, అయిదారు కమిటీలు వేసి తెలుగుదేశం పార్టీని కాదు. ఏకంగా ఏపీనే టార్గెట్ చేసారు. భావితరాలకు తీరని నష్టం చేసారు. అధికారంలోకి వస్తూనే తవ్వండి, తవ్వండి అన్నారు. తవ్వితే సన్మానాలు చేస్తాం, అవార్డులు ఇస్తాం... ప్లీజ్ అంటూ అధికారులను బతిమిలాడుకున్నారు. 8 నెలల క్రితమే మంత్రివర్గ ఉపసంఘం వేశారు. "

"రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడటం, పెట్టుబడులను తరిమేయడం తప్ప ఏం సాధించారు? ఇప్పుడీ జీవో 344 వైసిపి వేధింపులకు పరాకాష్ట. గత 5ఏళ్ల నిర్ణయాలపై మీరు సిట్ వేశారు. మీ 5ఏళ్ల పాలనపై రేపు రాబోయే ప్రభుత్వం సిట్ వేస్తుంది. కక్ష సాధించుకోవడం తప్ప, వీటివల్ల ప్రజలకు ఒరిగేది ఏంటి? వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నా మీద 26 విచారణలు(14 సభా సంఘాలు, 3 ఉపసంఘాలు, 4 న్యాయ విచారణలు, అధికారులతో 4 విచారణలు, 1 సిబిసిఐడి ఎంక్వైరీ..) చేయించారు. ఏమైంది? ఇదీ అంతే! రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసి, పాలనా యంత్రాంగాన్ని డీమొరలైజ్ చేయడమే వైసీపీ లక్ష్యం. సిట్ నే పోలీస్ స్టేషన్ గా పరిగణిస్తాం అనడం... తాము చెప్పింది చేయని అధికారులను బెదిరించడం, వేధించడం కోసమే. టిడిపి నేతలపై కక్ష సాధించడమే వైసీపీ అజెండా. తెలుగుదేశం పార్టీ ఏనాడూ ఎటువంటి తప్పులు చేయలేదు. వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదు." అని చంద్రబాబు ట్వీట్ చేసారు.

ఇక మరో పక్క నారా లోకేష్ కూడా ఈ విషయం పై ట్వీట్ చేసారు.. ఇది లోకేష్ ట్వీట్.. ''మహామేత'' అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిపై, 26 పైగా విచారణలు, 14 సభా సంఘాలు, 4 న్యాయ విచారణలు, 3 మంత్రివర్గ ఉప సంఘాలు, 4 అధికారులతో విచారణలు, 1 సిబిసిఐడి విచారణ చేయించారు. ఏమైంది? గత 9 నెలలుగా, మంత్రుల స‌బ్ క‌మిటీలు, అధికారుల కమిటీలు, విజిలెన్స్ విచారణ, సీఐడీ విచారణ, ఐటికి, ఈడీ కి ఉత్తరాలు రాసి విచారణ చెయ్యమన్నారు. ఏమైంది? ఇప్పుడు కొత్తగా సిట్ అంటున్నారు. అది కూడా బాబాయ్ మర్డర్లు లాంటి విచారణ చెయ్యాల్సిన పోలీసులతో ? ఇక్కడే అర్ధం అవుతుంది, ''యువమేత'' ఆత్రం. సాధించింది, సాధించేది ఏమి లేనప్పుడు సిట్ లతో కాలక్షేపం చెయ్యడమే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read