తెలంగాణలో ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఇవాళ తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వేసే ప్రతి ఓటు ఎంతో మార్పు తీసుకొస్తుందని గ్రహించాలని అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఉదయం ట్వీట్‌ చేశారు. మరోవైపు తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. "ఓటు వేయడం దేశ పౌరులుగా మన బాధ్యత. ఎవరికి వేస్తున్నామనేది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోండి."

cbn tweet 07122018

తెలంగాణలో ఉన్న నా సోదర సోదరీమణులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని కోరుతున్నా అంటూ ప్రధాని మోడీ తెలుగులో ట్వీట్ చేశారు. ప్రత్యేకించి నా యువ మిత్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాని తెలిపారు. వారంతా ప్రజాస్వామ్యాన్ని మరింత సుసంపన్నం చేయాలని ప్రార్థిస్తున్నా అంటూ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ‘ఇవాళ ఎన్నికల రోజు. తెలంగాణలో ఉన్న నా సోదర సోదరీమణులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని కోరుతున్నా. ప్రత్యేకించి నా యువ మిత్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని మరింత సుసంపన్నం చేయాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్‌ చేశారు.

cbn tweet 07122018

అటు భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ తెలంగాణ ఓటర్లకు పిలుపునిచ్చారు. ‘అభివృద్ధి ఆధారిత ప్రభుత్వం కోసం తెలంగాణలోని సోదర, సోదరీమణులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నా. ముఖ్యంగా యువ ఓటర్లు ఈ ప్రజాస్వామ్య పండగలో తప్పకుండా పాల్గొనాలి’ అని అమిత్‌షా ట్వీట్ చేశారు. మరో పక్క తెలంగాణాలో ఓటింగ్ కొనసాగుతుంది. తొలి రెండు గంటలు పోలింగ్ మందకొడిగా సాగినప్పటికీ ఇప్పుడు ఊపందుకుంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సీఈవో రజత్‌కుమార్ ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 15శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read