తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఎన్నికలు అవ్వగానే, భారీ బాదుడుకు, జగన్ మోహన్ రెడ్డి రెడీ అవుతున్నారని, అలెర్ట్ గా ఉండాలని, ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఆయన మాటల్లో "తెలుగుదేశం పార్టీ గెలిచిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జగన్ ప్రభుత్వం ఏప్రిల్ 1, 2021 నుండి పెంచిన ఆస్తి పన్ను తగ్గిస్తూ కౌన్సిల్ మొదటి సమావేశంలోనే తొలి తీర్మానం చేస్తాం. రిజిస్టర్ విలువ ఆధారంగా పట్టణాల్లో భారీగా ఆస్తి పన్ను పెంచేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకుంటాం. జగన్ కు ఓటేస్తే ప్రజలపై భారం పడుతుందని చంద్రబాబునాయుడు తెలిపారు. మంగళవారం నాడు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడుగారు మాట్లాడుతూ... అద్దె విలువ ఆధారంగా ఉండే పన్నులను ప్రభుత్వ రిజిస్టర్ విలువ పెంచినప్పుడల్లా ఆస్తి పన్ను పెరిగేలా జగన్ రెడ్డి చట్టం తీసుకొచ్చారన్నారు. నివాస భవనాలకు ఆస్థి పన్ను రిజిష్టర్డ్ విలువలో 0.5 శాతం వరకు పన్ను విధిస్తున్నారు. ఉదాహరణ – ఖాళీ స్థలం విలువ నిర్మిత భవనం విలువ కలిపి ఆస్థి విలువ కోటి రూపాయలు ఉందనుకుంటే దానికి ఏప్రిల్ 1 నుండి ఆస్థి పన్ను సంవత్సరానికి రూ.50 వేల వరకు చెల్లించవలెను. గతంలో ఈ ఇంటికి సుమారు సంవత్సరానికి రూ.1.5 లక్షలు అద్దె వస్తే సుమారు రూ.5 వేల వరకు పన్ను ఉండేది. పన్ను రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు పెరుగుతుంది. దీనివల్ల పట్టణ ప్రజలపై మరింత భారం పడుతుంది. నివాసేతర భవనాలకు ఆస్థి పన్ను (కమర్షియల్ భవనాలు) రిజిష్టర్డ్ విలువలో 2 శాతం వరకు పన్ను విధిస్తున్నారు. ఉదాహరణ - ఖాళీ స్థలం విలువ మరియు నిర్మిత, నివాసేతర భవనం విలువ కలిపి ఆస్థి విలువ కోటి రూపాయలు ఉంటే ఏప్రిల్ 1 నుండి సంవత్సరానికి రూ.2 లక్షల వరకు ఆస్థి పన్ను చెల్లించవలెను.

పాత పద్దతిలో ఇదే భవనానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పన్ను ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం తన అప్పు పరిధి పెంచుకోవడానికి ప్రజలపై భారం వేయడం సిగ్గుచేటు. పట్టణాల్లో ఆస్తి పన్ను పెంచడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలపై అద్దెలు పెంచి మరింత భారం వేయనున్నారు. విద్యుత్ రంగంలో శ్లాబు విధానం తీసుకొచ్చి ప్రజల నెత్తిన వేలాది రూపాయలు భారం విధించే విధంగా ఆస్తి పన్ను పెంచి ప్రజలను అప్పులపాలు చేస్తున్నారు. ఖాళీ స్థలం పన్ను ఆస్థి విలువలో మున్సిపాలిటీలలో 0.2 శాతం, మున్సిపల్ కార్పోరేషన్ లలో 0.5 శాతం పన్ను చెల్లించాలి. ఉదాహరణ – ఖాళీ స్థలం విలువ కోటి రూపాయలు ఉందనుకుంటే మున్సిపాలిటీల్లో సంవత్సరానికి రూ.20 వేలు, మున్సిపల్ కార్పోరేషన్ లో సంవత్సరానికి రూ.50 వేలు పన్ను క్రింద చెల్లించవలెను. దీనికి అదనంగా ఖాళీ స్థలంలో చెత్త గనుక ఉన్నట్లయితే మున్సిపాలిటీలలో 0.1 శాతం పెనాల్టీ క్రింద అనగా సంవత్సరానికి రూ.10 వేలు మరియు మున్సిపల్ కార్పోరేషన్ లో అయితే పెనాల్టీ 0.25 శాతం అనగా సంవత్సరానికి రూ.25 వేలు అదనంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా భారాలు వేసేందుకు మాత్రం జగన్ రెడ్డి చట్టాలు తీసుకొస్తున్నారు.

గతంలో పన్ను వేయని భవనాలు, ఖాళీ స్థలాలకు నూతన విధానంలో రిజిష్టర్డ్ విలువ ఆధారంగా పన్ను వేసేలా జగన్ రెడ్డి కొత్త చట్టం తీసుకొచ్చారు. పేద లేదా మధ్యతరగతి వారు కూడా 375 అడుగులు కన్నా ఎక్కువ నిర్మిత భవనంలో కనుక ఉన్నట్లయితే వారు కూడా రిజిష్టర్డ్ విలువ ఆధారంగా పన్ను చెల్లించేలా చట్టాలు తీసుకురావడం ప్రజలను వేధించడం కాదా? అపార్ట్ మెంట్లు వారు రిజిష్టర్డ్ విలువ ఆధారంగా పన్ను చెల్లించాలని నిబంధనలు పెట్టడం మధ్యతరగతి ప్రజల మీద భారం వేయడం కాదా? పేదలు అనధికారికంగా ప్రభుత్వ స్థలంలో గాని, మున్సిపల్ స్థలంలో గాని, ఎండోమెంట్ ల్యాండ్ లో గాని, వక్ఫ్ భూముల్లో గాని లేదా ఇతర పబ్లిక్ ప్రదేశాలలో ఇల్లు కట్టుకుంటే ఎటువంటి పట్టా గానీ, డాక్యుమెంట్ గానీ లేకపోయినా 100 శాతం అదనపు పన్ను విధించడం కక్ష సాధింపు చర్యలను నిదర్శనంలా కనిపిస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read