ప్రధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాసారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోరుతూ చంద్రబాబు లేఖ రాసారూ. ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది అని అనంరు. దుర్ఘటనపై మీ సత్వర స్పందనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. సత్వరమే మీరు స్పందించి చేపట్టిన చర్యలు విశ్వాసాన్నిచ్చాయి. గ్యాస్ లీకేజీపై విచారణకు సైంటిఫిక్ కమిటీని ఏర్పాటు చేయాలి. విషవాయువు విడుదలకు దారితీసిన అంశాలపై దర్యాప్తు చేయించాలి. లీకైన విషవాయువు స్టైరీన్ అని కంపెనీ చెబుతోంది. స్టైరీన్ వాయువుతో పాటు మరికొన్ని వాయువులు ఉన్నాయని భిన్న నివేదికలు ఉన్నాయి. గ్యాస్ లీకేజీపై దర్యాప్తు చేస్తేనే భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం తెలుస్తుంది. దీర్ఘకాలంలో చూపే దుష్ప్రభావాలపై నిశిత దృష్టి సారించాల్సి ఉంది అని చంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలో ఆరు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకు వచ్చారు.

"1.గ్యాస్ లీకేజి వివాదాస్పద అంశంపై విచారణకు సైంటిఫిక్ కమిటీని ఏర్పాటు చేయడం మరియు విష వాయువుల విడుదలకు దారితీసిన స్థానిక అంశాలపై దర్యాప్తు చేయడం. 2. లీక్ అయిన గ్యాస్ స్టైరీన్ అని కంపెనీ చెబుతుంటే, మరికొన్ని విష వాయువులు కూడా ఉన్నాయనే భిన్న నివేదికలు ఉన్నందున దానిపై దర్యాప్తు చేస్తేనే భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం తెలుస్తుంది. 3. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యంపై దీర్ఘకాలంలో చూపే దుష్ప్రభావాలపై నిశిత దృష్టి సారించాల్సివుంది. వెలువడే విష వాయువులు బాధితులకు శాశ్వత నష్టం చేస్తాయనేది ఇప్పటికే విదితమే. 4. విశాఖపట్నంలో మరియు పరిసరాల్లో గాలి నాణ్యత(ఎయిర్ క్వాలిటి)ని నిశితంగా పరిశీలిస్తేనే ప్రస్తుతం మరియు భవిష్యత్తులో ప్రభావాలను అంచనా వేయగలం.

5.ప్రజల ఆరోగ్యంపై అధ్యయనానికి జాతీయ మరియు అంతర్జాతీయ వైద్య నిపుణులను రంగంలోకి దించి తదనుగుణంగా తక్షణ మరియు దీర్ఘకాలిక వైద్య చర్యలు చేపట్టాలి. బాధితులకు సరైన నష్ట పరిహారం అందించేందుకు ఈ విధమైన అంచనాలే తోడ్పడతాయి. 6. ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులను అందజేయడం ద్వారా, దీర్ఘకాలిక ప్రాతిపదికపై ప్రతి రోగిని నిశితంగా పర్యవేక్షించడం, బాధితుల్లో మీ ప్రయత్నాలపట్ల విశ్వాసం పెంచేందుకు దోహదపడతాయి. వీటన్నింటిపై మీరు దృష్టి సారించి సముచిత చర్యలు చేపట్టాలని అభ్యర్ధిస్తున్నాను. " అంటూ చంద్రబాబు, ప్రధాని మోడీకి లేఖ రాసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read