ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి, మంత్రులు సచివాలయానికి రావచ్చునని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కొన్ని సమీక్షలు కూడా చేయవచ్చునన్నారు. ఏవి చేయాలి, చేయకూడదు అనే విషయాన్ని పార్టీలకు ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాల పుస్తకంలో స్పష్టత ఉందని తెలిపారు. గురువారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘‘ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలపై వైసీపీ ఫిర్యాదు చేసింది. దీనిపై సీఎస్‌ ద్వారా సంబంధిత శాఖాధికారులను నివేదిక కోరతాం. ఆయా శాఖల సమాధానాలు ఆధారంగా చర్యలు ఉంటాయి’’ అని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ వ్యయం రూ.550-600 కోట్ల వరకు ఉండొచ్చని ద్వివేది తెలిపారు. ఇందులో రాష్ట్రం సగం, కేంద్రం సగం భరిస్తాయన్నారు.

cbn 19042019

‘‘ఎన్నికల నిబంధనలకు సంబంధించిన పుస్తకాలను అన్ని రాజకీయ పార్టీలకు, అధికారులకు ఇచ్చాం. కోడ్‌ అమలులో ఉండగా అందరూ పాటించాల్సిందే. సీఎం చంద్రబాబు, మంత్రులు సచివాలయానికి రావొచ్చు. వారి వారి కార్యాలయాల్లో కూర్చోవచ్చు. అయితే రాజకీయ పరమైన పనులు చూడకూడదు’’ అని తెలిపారు. ఇక... పోలింగ్‌ ముందు రోజు, ఈ నెల 10వ తేదీన సీఎం తన కార్యాలయానికి వచ్చి మాట్లాడిన అంశాలను ఆంగ్లంలోకి తర్జుమా చేసి పంపాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరిందని... ఆ నివేదిక పంపించామని చెప్పారు. సీఎం ప్రజా వేదికలో నిర్వహించిన సమావేశాలపైనా వైసీపీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని తెలిపారు.

cbn 19042019

కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఒక పోలింగ్‌ బూత్‌లో ఉన్న ఓట్లకన్నా ఎక్కువ ఓట్లు పోలయ్యాయని ఫిర్యాదు వచ్చిందని ద్వివేదీ తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ను నివేదిక అడిగామని, టైపింగ్‌లో వచ్చిన తప్పుగా తేలిందని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో కలెక్టర్లు బాగా పని చేశారని కితాబిచ్చారు. కింది స్థాయి సిబ్బంది కూడా బాగా పని చేశారన్నారు. ఎన్నికల సిబ్బంది అందరికీ ఒకే విధంగా రెమ్యునరేషన్‌ ఇవ్వలేదని కొన్ని ఫిర్యాదులొచ్చాయని, దీనిపై కలెక్టర్లను వివరణ కోరామని తెలిపారు. ‘‘ఎన్నికల విధుల్లో 4 లక్షల మంది పాల్గొన్నారు. వారంతా తప్పు చేశారని కాదు. ఎక్కడో కొన్ని తప్పులు జరిగి ఉండవచ్చు. వాటిలో కొన్ని ఉద్దేశపూర్వకంగా, కొన్ని అవగాహనా లోపం వల్ల జరిగినట్లు నాకు ఫిర్యాదులు వచ్చాయి. తప్పు చేయనివాళ్లను అనవసరంగా ఇబ్బందిపెట్టం. గతంలో కన్నా రాష్ట్రంలో పోలింగ్‌ ఎక్కువ జరిగింది. ఏజెన్సీ ఏరియాల్లో కూడా బాగా జరిగింది. స్ట్రాంగ్‌ రూంల భద్రతపై సీఈసీ నివేదిక కోరింది.. పంపించాం. ’ అని తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read