ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీ ప్రకారం ప్రత్యేక హోదా కేంద్రం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలి అంటూ, 2018లో పోలూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేసారు. దీని పై విచారణ జరిపిన హైకోర్టు, కేంద్ర ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చెయ్యల్సిందిగా కోరింది. దీని ప్రకారం, కేంద్ర హోం శాఖ, నిన్న హైకోర్టుకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో విభజన హామీల్లో ఇచ్చిన అన్ని అంశాల పై, ఏమి చేసింది, కేంద్రం తెలిపింది. అయితే ఇందులో మూడు రాజధానుల విషయం ప్రస్తావించటంతో పాటుగా, రాజధాని అనేది కేంద్ర పరిధిలోని అంశం కాదు అని కేంద్రం చెప్పటం, ఒకింత చర్చకు దారి తీసింది. అమరావతికి ఇన్ని కోట్లు ఇచ్చాం అంటే అయిపోయే దానికి, అమరావతి గత ప్రభుత్వం ఆమోదించింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం మూడు రాజధానులు అంటుంది, మాకు రాజధాని విషయంలో సంబంధం లేదు అని కేంద్రం అఫిడవిట్ లో తెలిపింది. అయితే ఇది కేంద్రం కావాలనే పెట్టిందా అనే అభిప్రాయం వస్తుంది.

ఇక ప్రత్యేక హోదా పై 14వ ఆర్ధిక సంఘం సిఫారుసు మేరకు ఇవ్వటం కుదరదని చెప్పింది. ఆర్ధిక సంఘం సూచించిన విధంగా రెవిన్యూ లోటు పుడ్చామని, చెప్పింది. అలాగే 2015-20 మధ్య కేంద్ర ప్రాయోజిత పథకాల్లో, 90 శాతం కేంద్రం భరిస్తుందని, విదేశీ సాయంలో ఋణం, వడ్డీ కేంద్రమే కడుతుందని చెప్పింది. ఇక పోలవరం ప్రాజెక్ట్ ఇరిగేషన్‌ కాంపొనెంట్‌ కు అయ్యే ఖర్చు మొత్తం మేమే పెట్టుకుంటాం అని చెప్పమని, అందుకు అనుగుణంగా ఇప్పటి వరకు రూ.8,614.16 కోట్లు ఇచ్చామని చెప్పింది. ఇక అలాగే మిగతా అంశాలు పై కూడా, కేంద్రం ఏమి చేసింది, ఆ అఫిడవిట్ లో కేంద్రం తెలిపింది. మొత్తానికి, విభజన చట్టం అమలు పరుస్తున్నామని, కొన్ని ఇప్పటికే ఇచ్చేసామని చెప్తూ, కీలకమైన ప్రత్యెక హోదా ఇవ్వలేమని, అలాగే రాజధాని విషయం మాకు సంబంధం లేదని కేంద్రం చెప్పింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read