రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇస్తూ, నిధుల దారి మళ్లింపు, అలాగే ఇక నుంచి కేంద్రం నుంచి వచ్చే నిధుల గురించి, కేంద్రం , రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని, టిడిపి నేత పట్టాభి ఈ రోజు బయట పెట్టారు. ఆయన మాటల్లోనే, "రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా సాగిస్తున్న పరిపాలనలో రాష్ట్రం ఏ విధంగా దివాలా తీసిందో ప్రజలందరికీ తెలుసు. మూడు సంవత్సరాలుగా ఆర్థిక క్రమశిక్షణ లేక పోవడం వల్ల ఖజానా పూర్తిగా ఖాళీ అయింది. రాష్ట్రంలో ఆర్థిక అరాచక పాలన నడుస్తోంది. వరల్డ్ బ్యాంక్, ఏసియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్, న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ మరియు విదేశీ ఫైనాన్షియల్ ఇన్సిటిట్యూషన్స్, ఆర్థిక సంస్థలు, బ్యాంకులు పైసా కూడా రాష్ట్రానికి నిధులు విడుదల చేయని పరిస్థితులు ఉన్నాయి. ఇందుకు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి జగన్ రెడ్డిదే. నాలుగు రోజుల క్రితం జనవరి 17,2022న కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరి డాక్టర్ ప్రసన్న మినిష్టరీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్స్ తరపున రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి రావత్ గారికి వివిధ ప్రపంచ బ్యాంకుల నిధుల దుర్వినియోగం, దారి మళ్లింపుకు సంబంధించి ఘాటైన లేఖ రాశారు. ఇటువంటి లేఖలు కేంద్ర ఆర్థిక శాఖ నుండి రావడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. చంద్రబాబునాయుడు గారి హయాంలో ఇటువంటి పరిస్థితులు ఏనాడు లేవు. జగన్ నిర్వాకం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరంగా చాలా గడ్డు పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. రాష్ట్రంలో ఒకరకమైన ఆర్థిక ఎమర్జెన్సీ నెలకొనివుంది. రాష్ట్రంలో రోడ్లు మరియు వివిధ రకాల అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి పలు అంతర్జాతీయ బ్యాంకుల నుండి మంజూరైన రుణాలకు సంబంధించి అడ్వాన్సులు పొందడం కోసం అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరి రావత్ గారు డిసెంబర్ 16, 2021న ఒకసారి, మరలా డిసెంబర్ 21, 2021న మరోసారి కేంద్ర ఆర్థిక శాఖకు లేఖలు రాయడం జరిగింది. గతంలో నారా చంద్రబాబునాయుడు గారు రాష్ట్రంలో వివిధ రోడ్లు మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టుట కొరకై ఏసియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెన్ట్‌మెంట్ బ్యాంకు (ఏఐఐబి) నుండి 455 మిలియన్ యుఎస్ డాలర్లు అనగా సుమారు 3,300 కోట్ల రూపాయలు మరియు న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు నుంచి దాదాపు 6,400 కోట్ల పైచిలుకు నిధులు మంజూరు చేయించారు. (70 : 30) దామాషాలో ప్రాజెక్టు వ్యయంలో అంతర్జాతీయ బ్యాంకులు మరియు రాష్ట్ర ప్రభుత్వం భరించేలా రూపకల్పన చేసి తద్వారా పొందే నిధులను రాష్ట్రంలో కీలకమైన ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ ప్రాజెక్ట్ (ఏపీఆర్ఆర్‌పి), ఆంధ్రప్రదేశ్ రోడ్స్ అండ్ బ్రిడ్జస్ రీకన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్ (ఏపీఆర్ బిఆర్‌పి), ఆంధ్రప్రదేశ్ మండల్ కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ ఇంప్రూమెంట్ ప్రాజెక్ట్ (ఏపీఎంసీఆర్‌సీఐపీ) వంటి అనేక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఆనాడు చంద్రబాబునాయుడుగారు చేశారు."

"నేడు వీటికి మరియు ఇతర రుణాలకు సంబంధించి అడ్వాన్సులు పొందడం కోసం రాష్ట్రం కేంద్ర ఆర్థిక శాఖని తన లేఖల ద్వారా అనుమతి కోరగా జనవరి 17, 2022న కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన జవాబులో రాష్ట్ర ప్రభుత్వ విన్నపాన్ని నిర్ద్వందంగా తోసిపుచ్చడం జరిగింది. అంతేకాకుండా ఆయా రుణాలకు సంబంధించి నిధులు రాష్ట్రం పొందాలంటే తాను విధిస్తున్న అనేక షరతులుకు లోబడి పనిచేయాల్సివుంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖపై కొరడా ఝుళిపించింది. కేంద్రం తన లేఖ ద్వారా విధించినటువంటి అనేక షరతులలో ముఖ్యమైనది విదేశీ బ్యాంకుల నుండి రుణాలు మంజూరైన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన 30 శాతం నిధులను తక్షణమే చెల్లించాలని, ఆ తదుపరి మాత్రమే బ్యాంకు రుణాల నిధులు పొందే ఆస్కారం ఉంటుందని తేల్చి చెప్పింది. ఇంతవరకు ఈ రుణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఒక్క రూపాయి కూడా జమచేయలేదు. పై బ్యాంకుల నుండి నేటి వరకు అడ్వాన్సుగా వచ్చిన నిధులన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్ళించి దిగమింగుతోంది. ఆ కోవలోనే గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టు (ఏపీఆర్‌ఆర్ పి- ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ ప్రాజెక్టు) కిగాను గతంలో ఏఐఐబి బ్యాంకు నుండి అడ్వాన్సుగా తీసుకున్న 70 మిలియన్ డాలర్లు దారి మళ్లించి దోపిడీ చేశారు. ఇప్పుడు కేంద్రం తన లేఖలో ఆ 70 మిలియన్ డాలర్లకు సంబంధించి లెక్కలు కూడా తక్షణమే అప్పజెప్పాలని షరతు విధించింది. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా మారిందో మనందరికి తెలుసు. కనీసం గుంటలు కూడా పూడ్చలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వముంటే వచ్చిన నిధుల్ని దారి మళ్లించి రోడ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. "

"దోచిపెట్టిన డబ్బంతా మళ్లీ వెనక్కి తెచ్చి సంబంధిత శాఖలకు మీరు చెల్లింపులు చేస్తేనే భవిష్యత్తులో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి ఇంకా ఏసియన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ బ్యాంక్, ఎన్డీపీ, వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేయడానికి అనుమతి లభిస్తుందని తేల్చి చెప్పింది. అలా చేయకపోతే రాష్ర్ట ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా భవిష్యత్‌లో రాదు. అదేవిధంగా ఇకమీదట వివిధ అంతర్జాతీయ బ్యాంకుల ద్వారా పొందే రుణాలకు సంబంధించిన డబ్బు వారం రోజులలోపు సంబంధిత పీడీ అకౌంట్స్ లలో జమ చేసి తీరాల్సిందేనని నిబంధన విధించారు. దీనకి తోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇకమీదట ప్రతినెల రుణాలు పొందిన వివిధ ప్రాజెక్టుల అమలుకు సంబంధించి ఆర్థిక పరమైన మరియు భౌతిక పురోగతికి సంబంధించిన నివేదికలు తప్పక కేంద్ర ఆర్థిక శాఖకు సమర్పించాలని షరతు విధించింది. ప్రతి నెల ఏ ప్రాజెక్టు పని ఎంత పురోగతి సాధించింది, ఏ కాంట్రాక్టర్లకు ఎంతెంత నిధులు చెల్లించారన్న విషయాలు తప్పనిసరిగా ఇకమీదట ఒక నివేదిక రూపంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకి సమర్పించాలి. డిఇఏ (డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్స్) ఇకపై మన రాష్ట్రంలో వివిధ ప్రపంచ బ్యాంకు రుణాలతో చేపడుతున్న ప్రాజెక్టుల అమలు మరియు నిధుల వినియోగంపై నిత్యం పర్యవేక్షణ చేస్తుందని, ఎటువంటి లోపాలున్నాకూడా ఉపేక్షించబోదని ఈ లేఖ ద్వారా తేల్చి చెప్పింది. తక్షణమే తాము కోరిన విధంగా అన్ని విషయాలపై డాక్యుమెంటరీ ఈవిడెన్స్ తో కేంద్ర ప్రభుత్వానికి వివరాలు తెలియజేయాలని... ఆ విధంగా తెలియపరచిన తరువాతనే బ్యాంకు రుణాల అడ్వాన్సు విడుదల గురించి తాము ఆలోచన చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఒక క్రెడిబులిటి లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఏ విధమైన సమస్యలు ఉత్పన్నమవుతాయో నేడు కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖలోని అంశాలను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం రాసినటువంటి ఈ ఘాటు లేఖ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో అమలవుతున్న అన్ని ఇఏపీ ప్రాజెక్టులకు సంబంధించిన రుణాలు మరియు నిధుల వినియోగంపై తక్షణమే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం."

Advertisements

Advertisements

Latest Articles

Most Read