గత మూడు నెలలుగా, వైసీపీ నేతలు చేస్తున్న అరాచకానికి వ్యతిరేకంగా, తమ నిరసన వ్యక్తంచేస్తూ టీడీపీ పిలుపునిచ్చిన “చలో ఆత్మకూర్" నిన్న ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిన సంగతి తెలిసిందే. టీడీపీ నేతల పిలుపు నేపథ్యంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. దీంతో ఎక్కడికక్కడ టీడీపీ సీనియర్ నేతల హౌస్ అరెస్ట్లు, అడ్డుకోవడం వంటి చర్యల ద్వారా పోలీసు యంత్రాంగం టిడిపిని అడ్డుకుంది. మరోవైపు గుంటూరు జిల్లాలో టెన్సన్ వాతావరణం నెలకొంది. చలో ఆత్మకూరుకు పిలుపుతో, అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. మొహరం, వినాయక నిమజ్జనం సాకుగా చూపి, పల్నాడులో పోలీస్ యాక్ట్ 30, 144 సెక్షన్ విధించారు. దీని ద్వారా, అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడం కుదరదని, వాటి పై నిషేధం విధిస్తున్నామని చెప్పారు. అయినా టిడిపి ఆత్మకూరు వెళ్తున్నాం అని చెప్పటంతో, ఆత్మకూరులో భారీగా పోలీసులు మోహరించారు. గ్రామాల్లోకి బయట వారిని వెళ్ళనివ్వకుండా, ఆధార్, ఇతర గుర్తింపు కార్డులను చూసి పంపించారు.

home 120920219 2

చివరకు ఆత్మకూరులో ఉన్న రైతులను తమ పొలాలకు కూడా వెళ్లనివ్వక పోవడంతో పోలీసులు అడ్డుకోవటంతో, ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అలాగే ఆత్మకూరుకు రాకపోకల పై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. చివరకు పెళ్ళికి వెళ్లి వస్తున్న బంధువులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక చంద్రబాబు ఇంటి దగ్గర ఉదయం నుంచి హైడ్రామా నడిచింది. చంద్రబాబుని హౌస్ అరెస్ట్ చేస్తునట్టు పోలీసులు నోటీసులు అంటించారు. పల్నాడులో 144 సెక్షన్ ఉందని, అక్కడికి వెళ్ళటానికి వీలు లేదని పోలీసులు స్పష్టం చేశారు. చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేయడం పై డీజీపీ గౌతం సవాంగ్ స్పందిస్తూ, ప్రభుత్వ విధానాల పై పోరాడుతున్న కారణంగా, చంద్రబాబు అడ్డుకోలేదని, పల్నాడుకు వెళ్తే ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంటుందనే ముందస్తుగా చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేసినట్టు సవాంగ్ చెప్పారు. చలో ఆత్మకూరుకు తన ఇంటి నుంచి బయల్దేరుతున్న తనను హౌస్ అరెస్ట్ చేయడం పై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.

home 120920219 3

తన రాజకీయ జీవితంలో, ఈ పరిస్థితులు చాలా దారుణమని, ఎన్నో పోరాటాలు చేసిన తనను, ఎన్నడూ లేనివిధంగా ఇలా గృహనిర్బంధం చేశారన్నారు. అయితే నిన్న జరిగిన చలో ఆత్మకూరు జాతీయ స్థాయిలో హైలైట్ అయ్యింది. అన్ని జాతీయ చానల్స్ లో నిన్న మొత్తం ఇవే వార్తలు వచ్చాయి. చంద్రబాబుని హౌస్ అరెస్ట్ చెయ్యటంతో, మరింత వేడి పెరిగింది. దీంతో కేంద్ర హోం శాఖ కూడా రంగంలోకి దిగింది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఆత్మకూరులో ఏమి జరుగుతోంది, మొత్తం వివరాలు ఇవ్వాలి అంటూ, డీజీపీని, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఆత్మకూరులోనే కాక, రాష్ట్రం మొత్తం శాంతి భద్రతల పై నివేదిక కోరామని కిషన్ రెడ్డి అన్నారు. అయితే ఈ పరిణామం పై జగన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. కేంద్రం జోక్యం చేసుకోవటంతో, డీజీపీ కూడా వాస్తవ పరిస్థితి చెప్పల్సిన అవసరం ఉంటుంది. చూద్దాం ఏమి జరుగుతుందో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read