ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి గత 5 ఏళ్ళుగా ఉంటున్న సంగతి తెలిసిందే. 2016 నుంచి ఇక్కడే సచివాలయం నడుస్తుంది, ఇక్కడే గవర్నర్ ఉంటున్నారు, ఇక్కడే అసెంబ్లీ ఉంది, ఇక్కడే శాసనమండలి ఉంది, 2019 నుంచి హైకోర్టు ఇక్కడే నడుస్తుంది. అయితే ప్రభుత్వం మారిపోగానే, మొత్తం మారిపోయింది. అమరావతి మూడు ముక్కలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైజాగ్ లో సెక్రటేరియట్, అమరావతిలో అసెంబ్లీ, కర్నూల్ లో హైకోర్టు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ అంశం కోర్టుకు చేరటంతో, ఇందులో ముందుకు వెళ్ళలేక పోతున్నారు. అయితే ప్రభుత్వానికి అమరావతి పై కానీ, కర్నూల్ పై కానీ ప్రేమ లేదని, కేవలం వైజాగ్ లో ఉన్న భూములు కోసం, అక్కడ వెళ్తున్నారని, చేస్తున్న ఏర్పాట్లు అన్నీ వైజాగ్ కోసమే ఉన్నాయి కానీ, కర్నూల్, అమరావతి కోసం ఏమి లేవని ప్రాతిపక్షాలు ఆరోపిస్తిన్నాయి. నిజానికి కర్నూల్ వైపు న్యాయ రాజధాని తీసుకుని వెళ్ళటానికి, అసలు ఏ విధమైన కసరత్తు చెయ్యలేదు.

అయితే ఇప్పుడు తాజాగా కేంద్రం చెప్పిన విషయం చూస్తే, ఇదే నిజం అనిపించేలా ఉంది. దేశంలో ఎక్కడైనా హైకోర్టు బెంచ్ లు ఏర్పాటు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా అని, ఉత్తరప్రదేశ్ ఎంపీ అడిగిన ప్రశ్నకు, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సమాధనం చెప్తూ, మాకు అసలు ఉద్దేశం లేదని చెప్పారు. అంతే కాదు, తమకు ఏ రాష్ట్రం నుంచి కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయి ప్రతిపాదన రాలేదని చెప్పారు.. ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు ప్రధాన బెంచ్ 2019 జనవరి 1 నుంచి, అమరావతిలో పని చేస్తుందని అన్నారు. ఏ రాష్ట్రంలో హైకోర్టు బెంచ్ కావాలి అన్న, రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపించాలని, తరువాత హైకోర్టు చీఫ్ జస్టిస్, రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను ఒప్పుకోవాలని, అలాగే గవర్నర్ కూడా ఒప్పుకోవాలని కేంద్ర మంత్రి చెప్పారు. మొత్తానికి, ఈ సమాధానం బట్టి, కర్నూల్ లో హైకోర్టు గురించి, ఏపి రాష్ట్ర ప్రభుత్వం, ఇంకా ఎటువంటి ప్రతిపాదన పంపించాలేదని అర్ధం అయ్యింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read