ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాఖలు అయిన పిటీషన్ పై, కేంద్ర ప్రభుత్వాన్ని అఫిడవిట్ దాఖలు చేయ్యాల్సిందిగా గతంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తరుపున సెక్రటరీ ఆర్కే సింగ్, గత రాత్రి కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్ ను ఆన్లైన్ లో అప్లోడ్ చేసారు. ఈ అఫిడవిట్ లో ప్రధానంగా కీలక వివరాలు పేర్కొన్నారు. క్యాబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకే, విశాఖ స్టీల్ ప్లాంట్ లో వంద శాతం ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరణకు ఆదేశించామని స్పష్టం చేసారు. ప్రైవేటీకరణలో భాగంగానే, ఈ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పటంతో పాటుగా, ప్రైవేటీకరణ చేయటం ద్వారా, ఈ పెట్టుబడులు ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసారు. కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్ధిక పరిస్థితులు, దేశ ఆర్ధిక అవసరాలు దృశ్యా నిర్ణయాలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని, ఇటువంటి నిర్ణయాలు కోర్టుల్లో ప్రశ్నించజాలవు అని చెప్పి, గతంలో ఒక కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని ఈ సందర్భంగా అఫిడవిట్ లో ఉదారించారు. పైగా, దీనికి సంబంధించి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో అత్యంత కీలకమైన అంశం, వంద శాతం పెట్టుబడులు ఉపసంహరణ అనేది, దేశ వ్యాప్తంగా అనేక చోట్ల ఈ నిర్ణయం అమలు జరుపుతున్నాం అని పేర్కొన్నారు.

rrr 28072021 2

అదే విధంగా దీనికి సంబంధించి ఉద్యోగుల విషయంలో కూడా కీలక అంశాలు పేర్కొన్నారు. రాజ్యాంగంలో అంశాలు పేర్కొంటూ, దీని ప్రకారం, ఎక్కడైతే ఉద్యోగాలు పోయాయో, అలాంటి చోటే వారు కొనసాగుతారని, పైగా ఎవరైతే ప్రైవేటు ఉద్యోగులు ఉంటారో, వారికి రాజ్యంగ భద్రత లేదని అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇక క్యాబినెట్ కమిటీలో ప్రధాని మంత్రి, హోం మంత్రి, ఆర్ధిక శాఖ మంత్రి, ఉక్కు శాఖా మంత్రితో పాటు, కార్పొరేట్ అఫైర్స్ మినిస్టర్ కూడా సభ్యులుగా ఉన్నారని, ఉన్నత స్థాయి కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని, ఈ సందర్భంగా ఆయన చెప్పారు. అలాగే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయాణ ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అని, ఆయన పిటీషన్ కొట్టివేయాలని చెప్పి కూడా, అఫిడవిట్ లో కేంద్ర ప్రభుత్వం కార్యదర్శి స్పష్టం చేసారు. ఇటువంటి పిటీషన్ ల వల్ల, ప్రక్రియ వేగవంతం కాదని, జాప్యం జరుగుతుందని కూడా ఆయన తెలిపారు. అందుకే ఈ పిటీషన్ కు విచారణ అర్హత లేదని, అందుకే ఈ కేసు కొట్టేయాలని ఆయన తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read