ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పులతో సతమతం అవుతున్న వేళ, కేంద్రం నుంచి భారీ రిలీఫ్ లభించింది. ఇప్పటికే ఈ ఆర్ధిక ఏడాది చేయాల్సిన అప్పు చేసేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ అప్పు కోసం, కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి, ఎట్టకేలక కొంత అప్పు సాధించుకున్న విషయం తెలిసిందే. అయితే అదే ఏ మూలకు సరిపోదు. మళ్ళీ కేంద్రం నుంచి ఎలా ఎక్కువ అప్పుకి పర్మిషన్ తెచ్చుకోవాలా అనే ఆలోచిస్తున్న సమయంలో, కేంద్రం నుంచి ఒక శుభవార్త వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట కలిగించే వార్త ఇది. 2021-22 త్రైమాసిక-1లో, కేంద్ర ఆర్ధిక శాఖ నిర్దేశించిన లక్ష్యాలను 11 రాష్ట్రాలు చేరుకున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్న రాష్ట్రాలకు, బహిరంగ మార్కెట్ లో అదనపు అప్పు ఇచ్చేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా, మరో పది రాష్ట్రాలకు కేంద్రం ఎక్కువ అప్పు తీసుకోవటానికి అనుమతి ఇచ్చింది. మిగతా రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా, మన రాష్ట్రానికి మాత్రం ఇది పెద్ద ఊరట అనే చెప్పాలి. మొత్తం 11 రాష్ట్రాలకు అదనంగా రూ.15,721 కోట్ల వరకు అప్పు పొందేందుకు అనుమతి ఇస్తూ, కేంద్రం అనుమతులు ఇస్తూ, ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది.

appu 14092021 2

ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.2,655 కోట్ల వరకు అదనపు అప్పు తీసుకునేందుకు, కేంద్ర ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చింది. మూలధన వ్యయం లక్ష్యాన్ని చేరుకున్నందుకు, జీఎస్డీపీలో 0.25 శాతం వరకు అదనపు అప్పు తీసుకోవచ్చు అంటూ కేంద్రం అనుమతి ఇచ్చింది. ఆర్ధిక ప్రగతి మరింతగా ముందుకు వెళ్లేందుకు, ఈ ప్రోత్సహకాలను ఇచ్చినట్టు కేంద్ర ఆర్ధిక శాఖ చెప్తుంది. నిజానికి రుణాలు తీసుకునేందుకు, జీఎస్డీపీలో 4 శాతం వరకు అనుమతి ఇస్తారు. అయితే కేవలం అయుదు నెలల్లోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుమతికి మించి అప్పులు తీసుకుంది. ఇప్పటికే అనేక అప్పులు దాచింది అంటూ, కేంద్రం నుంచి కూడా రాష్ట్రానికి లేఖలు అందాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం పై వివరణ ఇచ్చే పనిలో ఉంది. అయితే ఇప్పటికే అప్పు లిమిట్ అయిపోవటంతో, రాష్ట్ర ప్రభుత్వం, ఆదాయ మార్గాల వైపు చూస్తూ, విపరీతంగా అన్ని రకాల పన్నులు పెంచేసింది. ఇలాంటి సమయంలో, కేంద్రం నుంచి అదనపు అప్పు తీసుకోండి అనే ప్రకటన రావటంతో, రాష్ట్రానికి పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read