లాక్‌డౌన్‌ను పొడిగించే దిశగా కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, నిపుణులు కూడా లాక్‌డౌన్‌ పొడిగించాలని కేంద్రానికి సూచిస్తున్నందున ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. చాలా రాష్ట్రప్రభుత్వాలతో పాటు నిపుణుల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకోనుందని సమాచారం.మార్చి 25న కేంద్రం విధించిన 21 రోజుల లాక్‌డౌన్‌ ఈనెల 14తో ముగియనుంది. అయితే దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న దృష్ట్యా లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగించాలని తెలంగాణ, రాజస్థాన్​ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి విన్నవించాయి. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా లాక్ డౌన్ కొనసాగించాలని కేంద్రాన్ని కోరారు. అలాగే మరో రెండు వారు లాక్ డౌన్ కొనసాగించాలని, కర్ణాటక ప్రభుత్వం కూడా కోరింది. నిపుణులు కూడా ఇదే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నందున కేంద్రం లాక్‌డౌన్‌ పొడిగించే దిశగా ఆలోచన చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.

లాక్​డౌన్​ ముగింపు ప్రణాళికను రూపొందించడంలో రానున్న ఏడు రోజులు అత్యంత కీలకమైనవని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కరోనా వ్యాప్తికి సంబంధించిన సమాచారం ఆధారంగానే .. లాక్​డౌన్​ ఎత్తివేయాలా? లేదా కొనసాగించాలా? అనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. అంతిమంగా ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా ప్రజలు కట్టుబడి ఉండాలని వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఏప్రిల్ 14 తరువాత కూడా లాక్​డౌన్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే... ప్రజలు ఇప్పటి వరకు కనబరిచిన అదే స్ఫూర్తితో సహకరించాలని వెంకయ్య పేర్కొన్నారు. దేశంలో కరోనా వ్యాప్తి నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్​డౌన్ ప్రకటించింది. ఇది మార్చి 25 నుంచి అమల్లోకి వచ్చింది.

కరోనా అంటువ్యాధి ప్రబలుతున్న ఈ విషమ పరిస్థితుల్లో, ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ కంటే ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ధనం పోతే ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, ప్రాణాలు పోతే తిరిగి తేలేము కదా అని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి భారత్​లో అంతకంతకూ విస్తరిస్తోంది. లాక్​డౌన్​ కొనసాగుతున్నా... వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్​లో ఇప్పటి వరకు 114 మంది కరోనా ధాటికి బలవ్వగా... మొత్తం​ కేసుల సంఖ్య 4,421కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఆరోగ్యమంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం... మహారాష్ట్రలో అత్యధికంగా 45 కరోనా మరణాలు సంభవించాయి. ఇవాళ రాజస్థాన్​లో ముగ్గురు వైరస్ సోకి మరణించారు. త్రిపురలో మొదటి కరోనా కేసు నమోదైంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read