ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నా, ఎన్ని ఆర్ధిక నేరాల కేసులు ఉన్నా, దర్జాగా ఎన్నికల్లో గెలిచేసి, కేసులతో సంబంధం లేదు, మాకు ప్రజా తీర్పు లభించింది అని భావిస్తున్న నేతలకు, ఇక మూడింది. దేశ వ్యాప్తంగా, ఇలా ఉన్న నేతల అవినీతి చిట్టా తీసి, వారి పై ఉన్న కేసులను ఏడాది లోపు విచారణ చేసి, ఒక వేళ నిజం అని తేలితే, వారు ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా చెయ్యాలనే పిటీషన్ పై సుప్రీం కోర్టులో ఈ రోజు వాదనలు జరిగాయి. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం, గత కొన్ని రోజులుగా ఈ పిటీషన్ పై విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఈ కేసు పై ఈ రోజు విచారణ జరిగింది. కోర్టు నియమించిన అమికస్ క్యూరి హన్సారి, కోర్టుకు అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసినట్టు తెలిపారు. ఈ అఫిడవిట్ లో సిబిఐ, ఈడీ కేసులు నమోదు అయిన నేతల పేర్లు ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆ కేసుల వివరాలు అమికస్ క్యూరిని అడిగిన జస్టిస్ సూర్యకాంత్ తెలుసుకున్నారు. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, తెలంగాణా సిబిఐ కోర్టులో 13 కేసులు పెండింగ్ లో ఉన్నాయని కోర్టుకు చెప్పారు.

ఇందులో ఎమ్మెల్యేల కేసులే ఎక్కువ అని, చాలా కేసుల్లో విచారణ దశకు కూడా కేసులు రాలేదని తెలిపారు. విచారణ వేగవంతం అయ్యేలా చూడాలని, అమికస్ క్యూరి, సుప్రీం కోర్టుకు సూచించింది. అయితే ఇదే సందర్భంలో కేంద్రం కూడా ఈ పిటీషన్ పై స్పందించింది. సొలిసిటరీ జనరల్ స్పందిస్తూ, ప్రజా ప్రతినిధుల పై ఉన్న కేసులు ఒక కాల పరిమితి లోపు పూర్తి చెయ్యటానికి తామకు ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాల కోసం, తమకు రెండు నెలల సమయం ఇవ్వాలని సొలిసిటరీ జనరల్ కోర్టును కోరారు. కేసులు తీవ్రతను బట్టి, ప్రాధాన్యతా క్రమంలో విచారణ జరగాలని, జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టు పెట్టాలని, అమికస్ క్యూరి సుప్రీం కోర్టుకు తెలిపారు. అయితే ఈ విషయంలో కోర్టు ఏ ఆదేశాలు ఇచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని, కేంద్రం కోర్టుకు తెలిపింది. దీని పై విచారణ చేసిన సుప్రీం, అమికస్ క్యూరి సూచనలు అన్నీ తీసుకుని, తగిన ఆదేశాలు ఇస్తామని కేసుని వాయిదా వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read