ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా, జీఆర్‍ఎంబీ, కేఆర్‍ఎంబీ పరిధిలోని సాగు నీట ప్రాజెక్ట్ లను స్వాధీనం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దీనికి సంబందించిన గజిట్ నోటిఫికేషన్ ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది. వచ్చే నెల 15 నుంచి ఈ గజిట్ నోటిఫికేషన్ అమలులోకి వస్తుందని, ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఈ నేపధ్యంలోనే ఈ ప్రాజెక్ట్ లను, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రక్రియ సాఫీగా సాగేందుకు, కేంద్ర ప్రభుత్వం లింక్ ఆఫీసర్ ల పేరుతో నలుగురు ఉన్నతాధికారులను నియమించింది. కేంద్ర జల సంఘంలో పని చేస్తున్న, డాక్టర్ ఎంకే మిశ్రా, డాక్టర్ జీకే అగర్వాల్, వీరి ఇద్దరినీ కూడా గోదావరి నది యాజమాన్య బోర్డుకు, డీకే శివరాజన్, అనుపమ అనే చీఫ్ ఇంజనీర్లని కృష్ణా నది యాజమాన్య బోర్డుకు నియమించింది. ఈ నలుగురు కూడా, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి, అలాగే నదీ యాజమాన్య బోర్డులకు అనుసంధానంగా వివాహరిస్తారని కేంద్రం జల సంఘం పేర్కంది. ఈ మేరకు కేంద్ర జల సంఘం గత రాత్రి ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు ఢిల్లీలో జీఆర్‍ఎంబీ, కేఆర్‍ఎంబీ చైర్మెన్లతో, కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి సమావేశం ఉండటంతోనే, గత రాత్రే ఈ ఉత్తర్వులు ఇచ్చారు.

water 13092021 2

అయితే రాష్ట్ర ప్రభుత్వాలు, ఇక్కడ రైతాంగం, మరీ ముఖ్యంగా ప్రకాశం జిల్లా టిడిపి ఎమ్మెల్యేలు లేవనెత్తుతున్న అభ్యంతరాల నేపధ్యంలో, గజిట్ నోటిఫికేషన్ అమలులోకి వస్తుందా లేదా అనే సందేహాలు ఉన్నప్పటికీ కూడా, ప్రస్తుతం అధికారుల నియామకం నేపధ్యంలో, కేంద్ర ప్రభుత్వం ముందుకే వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నది అనేది స్పష్టం అవుతుంది. ఉమ్మడి ప్రాజెక్ట్ లు మినహా, మిగతా వేటినీ కేంద్రం తమ పరిథిలోకి తీసుకోకూడదు అనే అభ్యంతరాలు వస్తున్నా, ఆర్ధిక పరమైన అంశాల పై కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అంతకు ముందు సాగర్, శ్రీశైలం, పులిచింతల పరిధిలో తెలంగాణా ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి పై, ఏమి చేయలేని జగన్ ప్రభుత్వం, కేసీఆర్ తో కూర్చుని మాట్లాడకుండా, కేంద్రానికి లేఖలు రాసి ఆ ప్రాజెక్ట్ లు కేంద్రం నోటిఫై చేసి, కేంద్రం పరిధిలోకి తీసుకోవాలని ఉత్తరం రాయగా, ఇదే అదునుగా భావించిన కేంద్రం, ఏకంగా అన్ని ప్రాజెక్ట్ లను తమ ఆధీనంలోకి తీసుకుని, రెండు రాష్ట్రాలకు షాక్ ఇచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read