ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్న హామీలను కేంద్ర ప్రభుత్వం తుంగలోకి తొక్కింది. అమరావతి మీదుగా, విజయవాడ గుంటూరు మధ్య రైల్వే లైన్ నిర్మాణం ప్రాజెక్ట్ కు, 2017 రైల్వే బడ్జెట్ లో చేర్చారు. అయితే ఆ తరువాత, ఈ విజయవాడ గుంటూరు, వియా అమరావతి రైల్వే లైన్ కు అయ్యే ఖర్చును భరించటానికి ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించ లేదని, అందుకే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏదైతే విభజన చట్టంలో ఉన్న హామీలు, రైల్వే ప్రాజెక్ట్ కు సంబంధించిన హామీలు, ఏమయ్యాయి, ప్రస్తుతం రైల్వే శాఖకు సంబంధించి, అమరావతి రైల్వే లైన్ కు సంబంధించినటు వంటి రైల్వే లైన్ ఏమైంది అంటూ, సామాజిక కార్యకర్త రవికుమార్, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆక్ట్ కింద అడిగినటు వంటి ప్రశ్నకు, కేంద్రం ప్రభుత్వం ఈ విధంగా సమాధానం ఇచ్చింది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆంధ్రప్రదేశ్ కు , కొత్త రాజధాని నుంచి హైదరాబాద్ లోని ప్రముఖ నగరాలకు ర్యాపిడ్ రైలు, అదే విధంగా రోడ్లు అనుసంధానానికి చర్యలు తీసుకోవాలని చెప్తూ, విభజన చట్టంలో ఉన్న 13వ షెడ్యుల్ లో, 11వ అంశంగా, ఈ అంశాన్ని చేర్చారు. అయితే దాని పై ఇంత వరకు కూడా ఆతీ గతీ లేదు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో, దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేసారు. దానికి సంబందించినటు వంటి డీపీఆర్ లు అన్నీ సిద్ధం చేసి, ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదింపులు జరిపి, కేంద్ర బడ్జెట్ లో కూడా నిధులు పెట్టించారు.

modi 04032021 2

అయితే ఆ తరువాత వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, దీని పై నిమ్మకు నీరుఎత్తినట్టు ఉండటంతో, ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్ట్ చూపించకపోవటం, మేము కూడా ఏమి చేయలేం అంటూ కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన ఆర్టీఐ రిపోర్ట్ లో స్పష్టం చేసింది. ఈ మొత్తం రైల్వే లైన్, అమరావతి మీదుగా విజయవాడ గుంటూరు, వయా యర్రబాలెం, నంబూరు, సింగల్ లైన్, దాదాపుగా 56 కిమీ ఉంటుంది. ఈ నిర్మాణానికి సంబంధించి గతంలో డీపీఆర్ కూడా వచ్చిందని, దీనికి మొత్తం అయ్యే ఖర్చు కూడా 1,732 కోట్లు అవుతుందని, అయితే ఈ ప్రాజెక్ట్ వ్యయం పంచుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సిద్ధంగా లేదని, అందుకే ఈ ప్రాజెక్ట్ పై ముందుకు వెళ్ళటం లేదు అంటూ, అందులో స్పష్టం చేసారు. అంతే కాకుండ, ర్యాపిడ్ రైల్ కూడా, ఇప్పుడు అవసరం లేదని, ఇప్పటికే అమరావతి నుంచి హైదరాబాద్, తెలంగాణాలో ప్రాంతాలకు రైల్వే అనుసంధానం బాగానే ఉంది కాబట్టి, ఇప్పుడు ర్యాపిడ్ రైల్ కూడా అవసరం లేదని, అందులో స్పష్టం చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read