ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన విధానం పై, ఇప్పటికే కేంద్రం గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విద్యుత్ ఒప్పందాల సమీక్ష విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, కేంద్రానికి కూడా చెడ్డ పేరు వచ్చింది. జగన్ చేసిన పనుల వల్ల, జపాన్ ప్రభుత్వం, కేంద్రానికి కూడా లేఖ రాసి, ఇలా అయితే ఎవరూ విదేశీ పెట్టుబడులు పెట్టరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. విద్యుత్ ఒప్పందాల విషయం పై కేంద్రం చెప్పీ చెప్పీ, రాష్ట్రంతో విసుగెత్తిపోయింది. మళ్ళీ పోలవరం విషయంలో కూడా ఇదే తంతు. కేంద్రం హెచ్చరికలు ఇస్తున్నా, రాష్ట్రం పట్టించుకోవటం లేదు. అయితే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరో సమీక్షతో రెడీ అవ్వటంతో, ఇక కేంద్రానికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మీకు అసలు ప్రాజెక్ట్ లు అయ్యే ఉద్దేశం ఉందా అంటూ, రాష్ట్ర అధికారుల పై, కేంద్ర ప్రభుత్వ అధికారులు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసారు.

review 23082019 2

కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో, రాష్ట్రంలో రూ.1600కోట్ల వ్యయంతో ‘సమీకృత నీటిపారుదల, వ్యవసాయ పరివర్తనా పథకం’ అమలవుతోంది. దీని పై ఢిల్లీలో సమీక్ష జరిగింది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి, ప్రపంచ బ్యాంకు కుద సహాయం చేస్తూ ఉండటంతో, వారు కూడా ఈ సమీక్షకు హాజరయ్యారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక పై, ప్రపంచ బ్యాంక్ అధికారుల ముందే, కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సమీర్‌కుమార్‌ఖరే, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. చివరకు చిన్న నీతి తరహా ప్రాజెక్ట్ ల పై కూడా మీరు సమీక్షల పేరుతొ పనులు నిలిపివేస్తే ఎలా ? అనుకున్న సమయానికి పనులు పుర్తవుతాయా అంటూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై అసహనం వ్యక్తం చేసారు.

review 23082019 3

ఆ సమయంలో, ప్రపంచబ్యాంకు భారత్‌ డైరెక్టర్‌ జునాయ్డ్‌ కమల్‌ అహ్మద్‌ కూడా అక్కడే ఉన్నారు. ఇలా సమీక్షల పేరుతొ, పనులు ఆపేస్తే, ప్రపంచ బ్యాంకు నుంచి, కేంద్రం నుంచి మీకు నిధులు ఎలా వస్తాయి అని నిలదీశారు. కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సమీర్‌కుమార్‌ఖరే అడిగిన ప్రశ్నలకు, రాష్ట్ర అధికారులు సమాధానం చెప్పలేక పోయారు. ఈ పనులు తప్ప మిగతవి సజావుగా జరుగుతున్నాయని, పూర్తయిన పనులకు బిల్లులు కేంద్రం నుంచి రావాలని రాష్ట్ర అధికారులు కోరారు. వీటి పై నిబంధల ప్రకారం చూస్తామని, మిగతా పనులు విషయంలో ప్రత్యెక శ్రద్ధ పెట్టి, అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసేలా చూడాలని, రాష్ట్ర అధికారులకు, కేంద్ర అధికారులు కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read