కేంద్రం, కాగ్, జాతీయ కమిషన్, ఎన్జీటీ, హైకోర్టు, సుప్రీం కోర్టు, ఇలా ప్రతి ఒక్కరూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పై ఏదో ఒక సందర్భంలో తరుచూ సీరియస్ అవుతూనే ఉంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వైఖరి మార్చుకోవటం లేదు. తాజాగా ఏపి ప్రభుత్వం పై, కేంద్రం మరోసారి సీరియస్ అయ్యింది. ఏపిలో ఎంపీ లాడ్స్ దుర్వినియోగం అవుతున్నాయి అంటూ, కేంద్రానికి ఫిర్యాదులు వెళ్ళాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రధాని మోడీకి ఈ విషయంలో లేఖ రాసారు. ఎంపీ లాడ్స్ నిధులు పక్కదారి పట్టిస్తున్నారని ఫిర్యాదు చేసారు. ఆ ఫిర్యాదుల్లో ఎంత నిజం ఉంది, ఇది నిజమేనా అంటూ, కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, కేంద్ర గణాంకాలు, ప్రణాళిక శాఖ ఒక లేఖను ఏపి ప్రభుత్వానికి పంపించింది. అయితే దాని పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఏకంగా కేంద్రానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవటంతో, మరోసారి కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యి, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి మరో లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సమాధానం బట్టి, కేంద్రం, ప్రధాని కార్యాలయానికి నివేదిక ఇవ్వాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, కేంద్రం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం లేదు.

modi 27112021 2

దీంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా లేఖ రాసి, ఈ అంశం సీరియస్ గా తీసుకోవాలని, వెంటనే కేంద్రం అడిగిన వాటి పై, సమాధానం ఇవ్వాలని కోరారు. ఎంపీ లాడ్స్ నిధులను చర్చిల నిర్మాణం కోసం ఖర్చు చేస్తున్నారని తమకు వస్తున్న ఫిర్యాదులు పై వెంటనే నివేదిక ఇవ్వాలని కోరారు. ప్రధాని కార్యాలయానికి తాము నివేదిక ఇవ్వాలని, అందుకే వెంటనే మీరు సమాధానం హ్సుప్పండి అంటూ, చీఫ్ సెక్రటరీతో పాటుగా, రాష్ట్ర ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శికి ఈ లేఖలు పమించింది కేంద్ర ప్రభుత్వం. ఈ అంశంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఎంపీ నందిగం సురేష్, ఒక చర్చి నిర్మాణానికి ఏకంగా ఎంపీ లాడ్స్ నుంచి చర్చి నిర్మాణానికి రూ.40 లక్షలకుపైగా నిధులు అలాట్ చేయటం పైన, మీడియాలో వచ్చిన కధనాలతో, ఎంపీ రఘురామకృష్ణం రాజు, ప్రధాని మోడీకి లేఖ రాసారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రధాని, ఈ లేఖ పై కేంద్ర గణాంకాలు, ప్రణాళిక శాఖ వివరణ కోరగా, వారు రాష్ట్రానికి లేఖ రాసినా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవటం, ఇప్పుడు మరోసారి సీరియస్ అయ్యారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read