అన్ని రాష్ట్రాల్లో కాషాయం ఎగరు వెయ్యటానికి వ్యూహం పన్నిన బీజేపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తమ ప్రయత్నాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చెయ్యటానికి సరైన ఆయుధం కోసం బీజేపీ ఎదురు చూస్తుంది. ఇప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ రీ టెండరింగ్, విద్యుత్ ఒప్పందాల సమీక్షలో జగన్ మోహన్ రెడ్డికి కేంద్రం చుక్కలు చూపిస్తుంది. చివరకు స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మి లాంటి వాళ్ళని కూడా, డిప్యుటేషన్ పై ఆంధ్రప్రదేశ్ కు పంపించటానికి ఒప్పుకోలేదు. ఈ నేపధ్యంలోనే జగన్ మీద ఉన్న కేసులతో కాకుండా, రాజకీయంగా దెబ్బ కొట్టటానికి వ్యూహం పన్నింది బీజేపీ. అవకాసం కోసం ఎదురు చూస్తున్న బీజేపీకి, ఇప్పుడు కోడెల ఆత్మహత్య రూపంలో ఒక ఆయుధం దొరికింది. కోడెల ఆత్మహత్య చేసుకున్న రోజున, కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.

governor 19092019 2

సహజంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పై విమర్శలు చెయ్యదు. కాని కిషన్ రెడ్డి మాత్రం, రాష్ట్రంలో ప్రభుత్వం, అధికారుల వైఖరి పై విమర్శలు చేసారు. కోడెల మృతి పై, కేంద్రం సంస్థలతో దర్యాప్తు చేపిస్తాం అని చెప్పి, రెండు రాష్ట్రాల డీజీపీల నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటాం అని చెప్పారు. అయితే ఈ రోజు చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ని కలవటం కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ, రాజ్‌భవన్‌లో గవర్నర్ హరించందన్ బిశ్వభూషణ్‌ ను కలిసారు. చంద్రబాబు 13 పేజీల లేఖ ఇచ్చి, జరిగిన విషయాలు అన్నీ గవర్నర్ కు చెప్పారు. సాక్షి మీడియా, వైసీపీ నాయకులు, డీజీపీ నుంచి కానిస్టేబుల్ దాకా, ఎలా ఇబ్బంది పెట్టింది వివరాలు, ఆధారలు ఇచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ, గవర్నర్ తన అధికారాలను ఉపయోగించి..కోడెల ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు చేయిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. కిషన్ రెడ్డి మాటాలు, గవర్నర్ మాటలు, చంద్రబాబు సిబిఐ ఎంక్వయిరీ డిమాండ్, ఇవన్నీ చూస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం పై గట్టిగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది.

governor 19092019 3

ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఇరుక్కోవటం ఖాయంగా భావిస్తున్నారు. ఎందుకంటే కోడెల ఓడిపోగానే లెటర్ రాసారు. మే 23 న ఫలితాలు వస్తే, జూన్ 2 న అసెంబ్లీ అధికారులుకు లెటర్ రాసి, ఫర్నిచర్ తీసుకు వెళ్ళమన్నారు. తరువాత కూడా రెండు సార్లు లెటర్ రాసారు. అయినా ప్రభుత్వం స్పందించక పోగా, ఎదురు దొంగతం కేసు పెట్టింది. నిజానికి, ఒక వేళ కోడెల ఇవ్వకపోతే, అక్కడకు వెళ్లి తీసుకునే బాధ్యత ప్రభుత్వానిది, అంతే కాని ఇలా కేసు పెట్టటం పై అనుమానాలు వస్తున్నాయి. కేంద్ర సంస్థలతో ఎంక్వయిరీ వేస్తె, ఈ ప్రాసెస్ మొత్తంలో ఉన్న అధికారులు, ఎందుకు అలా చేసింది, ఎవరి ఒత్తిడితో అలా చేసింది సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఈ కేసును ఉపయోగించుకుని బీజేపీ రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి ఇలా చెయ్యటం వల్ల, ఒక సామాజికవర్గానికి, మేము అండగా ఉన్నాం అనే సంకేతాలు పంపించి, వారిని తమ వైపు తిప్పుకునే ఆలోచనలో ఉంది. అలాగే, ఇప్పటికే శాంతి బధ్రతలు లేవు అంటూ, రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న పోరాటానికి బలం వస్తుందని నమ్ముతున్నారు. చూద్దాం మరి కేంద్రం ఏమి చేస్తుందో ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read