రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి, మా మధ్య ఎవరూ గొడవలు పెట్టలేరు, మేము అన్యోన్యంగా ఉన్నాం అంటూ ఒక పక్క చెప్తూనే, మరో పక్క లేని వివాదాలు సృష్టించి, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. గతంలో ముచ్చుమర్రి కట్టిన సమయంలో, లేని హడావిడి, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. రాయలసీమ ఎత్తిపోతల పధకం అంటూ అదేదో కొత్త పధకంలా చెప్తూ, పోతిరెడ్డి పాడు కాలువ వెడల్పు పనులు చేస్తూ, ఏపి చేస్తున్న హడావిడికి, మా ప్రాంతం దెబ్బ తింటుంది అంటూ తెలంగాణా హడావిడి చేస్తుంది. పోనీ అక్కడ నీళ్ళు ఎప్పుడూ ఉంటాయా అంటే, గట్టిగా పది పదిహేను రోజులు వరదలు వచ్చినప్పుడు ఉపయోగపడే ప్రాజెక్ట్ అది. దీని కోసం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య, మేము హీరోలం అంటే మేము హీరోలం అనే హడావిడి మొదలైంది. నాలుగు నెలల క్రితం హడావిడి జరిగినా, అప్పుడు సద్దుమణిగి, ఇప్పుడు మళ్ళీ హడావిడి మొదలైంది.

దీంతో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాల పై, ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. జల వివాదాల పరిష్కారం పై కేంద్రం ఫోకస్ చేసింది. వచ్చే నెల 5న, తెలంగాణా సియం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సియం జగన్ తో, కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ సామవేసం కానున్నారు. కృష్ణా, గోదావరి జలాల నీటి పంపకాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసిన రాయలసీమ ఎత్తిపోతల పై కూడా చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల ఫిర్యాదులు, అభ్యంతరాల పై చర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, ఈ సమావేశం జరగునుంది. మరి ఈ సమావేశంలో అయినా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక అభిప్రాయానికి వస్తారో లేక, బయటకు వచ్చి, నువ్వు కొట్టినట్టు నటించు అనే విధంగా చేస్తారో చూడాలి. కేంద్రం ఇప్పటికైనా ఒక డైరెక్షన్ ఇస్తుందేమో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read