జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం ఘాటు లేఖ పంపింది. అప్పులపై పూర్తి వివరాలు అందించాలని, రాష్ట్ర ఆర్ధిక శాఖ అధికారులకు, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం తాజాగా రాసిన లేఖ, ఇప్పుడు రాష్ట్ర ఆర్ధిక శాఖ వర్గాల్లో గుబులు రేపుతుంది. దీని పై ఆందోళన కూడా ఆర్ధిక శాఖ అధికారులలో వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పోరేషన్లు, సొసైటీల ద్వారా ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి, చేస్తున్న అప్పులకు సంబంధించిన, వివరాలు పంపాలని చెప్పి, కేంద్ర ఆర్ధిక శాఖ అధికారులతో పాటుగా, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం కూడా రాష్ట్రా ఆర్ధిక శాఖకు లేఖ రాసింది. దీంతో పాటు, ఈ అప్పులు అన్నిటినీ , రాష్ట్ర ప్రభుత్వ అప్పులగా పరిగణిస్తామని కూడా చెప్తున్నారు. వీటి అన్నిటికీ మించి, కేంద్ర ఆర్ధిక శాఖలోని వ్యయ నియంత్రణా విభాగం, రాష్ట్ర ఆర్ధిక శాఖకు ఒక లేఖ రాసింది. రాష్ట్రంలో FRBM పరిమితికి మించిన తీసుకున్న అప్పులు, రాష్ట్రంలో అప్పులు, ఆదాయం, అప్పులకు సంబంధించిన వివరాలు పంపాలని, 26 పేజీల లేఖ రాయగా, ఆ లేఖ కు సమగ్ర సమాచారం రాష్ట్రం వైపు నుంచి ఇవ్వక పోవటంతో, కేంద్ర ఆర్ధిక శాఖ, ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సంబధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది.

modi 14052022 2

అయితే తాజాగా ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన కొత్త లేఖలో, ప్రధానంగా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ పై, అంటే బడ్జెట్ లో లేని, అప్పులు ఏవి అయితే ఉన్నాయో, కార్పోరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు ద్వారా అప్పులు తీసుకుని వస్తున్నారో, వేటికి అయితే ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి అప్పులు తెస్తుందో, వాటి వివరాలు కావాలని కేంద్రం ఆదేశించింది. ఒక వేళ వివరాలు రాష్ట్ర ఆర్ధిక శాఖ పంపించకపోతే మాత్రం, బ్యాంకుల నుంచి ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం, వాటిని తీప్పించుకునే అవకాసం ఉండటంతో, రాష్ట్ర ఆర్ధిక శాఖ అధికారులలో టెన్షన్ ప్రారంభం అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు చేస్తున్న అప్పుల గుట్టు, అడ్డ దిడ్డంగా చేస్తున్న అప్పు గుట్టు ఇవి మొత్తం ఇప్పుడు బయట పడే టైం వచ్చింది. కేంద్రం ఒక్కో స్క్రూ గట్టిగా బిగిస్తూ వస్తుందని, త్వరలోనే సీన్ క్లైమాక్స్ కు వచ్చేస్తుందని, రాష్ట్ర ఆర్ధిక శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు చేసిన తప్పుకు, తాము బలి కాబోతున్నారని భయపడుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read