ఏపి అధికారుల పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీ లాడ్స్ నిధుల ఖర్చు పై, వివరణ ఇవ్వాలి అంటూ, కేంద్రం లేఖ రాసింది. ఎంపీ లాడ్స్ నిధులు పక్కదోవ పడుతున్నాయి అంటూ, రఘురామకృష్ణం రాజు ప్రధాని కార్యాలయానికి ఇచ్చిన ఫిర్యాదు నేపధ్యంలోనే కేంద్రం నుంచి ఈ స్పందన వచ్చిందని తెలుస్తుంది. కేంద్రం సూచించిన నిబంధనలకు అనుగుణంగా నిధులు ఖర్చు చేయకపోవటం పై కేంద్రం, రాష్ట్రానికి లేఖ రాసింది. దీని పై పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలి అంటూ, ప్రణాళికా విభాగం ముఖ్య కార్యదర్శికి, కేంద్రం లేఖ రాసింది.  మత సంబంధ భవనాలకు ఎంపీ ల్యాడ్స్ నిధులు కేటాయింపు విషయం పై కేంద్రానికి ఫిర్యాదు అందింది. బాపట్లలో ఒక చర్చి నిర్మాణానికి రూ.86 లక్షల నిధులను వెచ్చించారు అంటూ రఘురామరాజు తమ ఫిర్యాదులో తెలిపారు. చాలా చోట్ల ఇలాగే చేసారు అంటూ ఫిర్యాదు చేసారు. దీని పై కేంద్రం ప్రశ్నల వర్షం కురిపిచింది. మత సంస్థలకు  ఎంపీ లాడ్స్ నిధులు ఖర్చు చేయకూడదని తెలిసినా, ఎందుకు ఖర్చు చేసారు అంటూ కేంద్రం ప్రశ్నించింది. నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని, వీటికి అధికారులే బాధ్యులు అవుతారు అంటూ, కేంద్రం రాష్ట్ర అధికారులను హెచ్చరించింది. పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని కోరింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read