ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో ఉంద‌ని కేంద్ర‌మంత్రి దేవ్ సిన్ష్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీలో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న వైఎస్ జ‌గ‌న్ రెడ్డి ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయింద‌న్నారు. గుడ్ గవర్నెన్స్ లో జగన్ విఫలమయ్యార‌ని తెలిపారు.  కేంద్రం ఇచ్చే నిధులు, 14, 15 వ ప్రణాళికా సంఘం నిధులను ప్రభుత్వం వేరే మార్గంలో వాడుకుంటోంద‌ని ఆరోపించారు. కేంద్ర నిధులు ఇతర మార్గాల్లో ఖర్చు చేయ‌డం నిబంధ‌న‌ల ఉల్లంఘ‌నేన‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం పంచాయతీలకు ఇచ్చే నిధులను గ్రామాల అభివృద్ధికి వినియోగించాల‌న్నారు.  రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు, సిబ్బంది జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నార‌ని పేర్కొన్నారు. వైసీపీ తెచ్చిన వాలంటీర్లు సేవ చేయడం లేద‌ని, ఇతర పార్టీలను అణచివేసేందుకు వాలంటీర్లను వాడుకుంటున్నార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌భుత్వ నిధుల‌ను వాలంటీర్లకు పంచుతున్నార‌ని మండిప‌డ్డారు. కేంద్ర ప్రభుత్వం అమ‌లుచేస్తోన్న ఆయుష్మాన్ కార్డు పేదలకు ఇవ్వడంలేద‌ని  కేంద్రమంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read