ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత మూడు నెలలుగా, తెలుగుదేశం పార్టీ పై వెంటాడి, వెంటాడి చేస్తున్న రాజకీయ దాడుల పై, నిరసన తెలిపేందుకు, భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణుల పై గత మూడు నెలలుగా, ఇప్పటి వరకు 500 పైగా దాడులు జరిగాయి, 8 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించటానికి, పల్నాడులో దాడులు ఎదుర్కోవటానికి, ఈ నెల 11న చలో ఆత్మకూరు కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో నలు మూలల నుంచి తెలుగుదేశం శ్రేణులు ఇక్కడకు రావాలని, ఆలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసిపీ బాధితులు ఇక్కడకు రావాలని చంద్రబాబు పిలుపిచ్చారు. అయితే, ఈ ఆందోళనకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా ? లేక శాంతి భద్రతలు సాకుగా చంద్రబాబుతో పాటు అందరినీ అడ్డుకుంటుందా ? అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

cbn 09092019 2

అయితే ఈ ఆందోళన కార్యక్రమం పై చంద్రబాబు మాత్రం పట్టుదలతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు, నేతలు ఒంటరి వారు కాదని, ఈ కార్యక్రమంతో, చాటి చెప్పాలని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే ఒక వ్యక్తి కాదని, ఇది ఒక పెద్ద వ్యవస్థ అని, ఈ ప్రోగ్రాం ద్వారా, ఈ మొద్దు ప్రభుత్వానికి చాటి చెప్పుదామని చంద్రబ్బు అన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు అందరూ తరలి రావాలని, నిన్న నిర్వహించిన టెలి-కాన్ఫెరెన్స్ లో చెప్పారు. పార్టీ కార్యకర్తల పై దాడులు గురించి, జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు చేయాలనీ చంద్రబాబు అన్నారు. అలాగే ఎక్కడైతే పోలీసులు తెలుగుదేశం సానుభూతి పరులు, పెట్టిన కేసుల గురించి, పట్టించుకోవటం లేదో, అక్కడ ప్రైవేటు కేసు పెట్టాలని చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పారు.

cbn 09092019 3

ఈ నెల 10న తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ సమావేశం అవుతుందని, పార్టీకి చెందిన న్యాయవాదులంతా హాజరవుతారని, చట్ట పరంగా ఏమి చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటామని చెప్పారు. కార్యకర్తల పై దాడులు, అక్రమ కేసులు పై ఈ లీగల్ సెల్ అండగా ఉంటుందని, కార్యకర్తలు అందరూ ధైర్యంగా ఉండాలని చంద్రబాబు కోరారు. వీళ్ళ ఆటలు ఇంకా సాగనివ్వను, ప్రభుత్వాలు మారినప్పుడు భావోద్వేగాలు సహజం అని ఇన్నాళ్ళు కాంగా ఉన్నాం, కాని మూడు నెలలు అయినా, ఇంకా ఇంకా రెచ్చిపోతున్నారని, వీళ్ళ సంగతి చూస్తానని, ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, ముందు నా పై కేసులు పెట్టమనండి చూద్దాం అంటూ చంద్రబాబు సవాల్ విసిరారు. బాబాయి ని చంపినివాడిని ఇప్పటి వరకు పట్టుకోలేక పోయారు కాని, మన పైన మాత్రం దాడులు చేస్తున్నారని అన్నారు. బాధితులు అందరినీ బస్సులు పెట్టి, ఈ నెల 11న ఆత్మకూరు తీసుకువెళ్తాం, అంటూ చంద్రబాబు ధైర్యం చెప్పారు. అయితే ఈ కార్యక్రమం పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read