రాష్ట్రంలో రాజకీయం చెయ్యలేక, బీహార్ నుంచి అరువు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ముఖ్యంగా కుల గొడవలు పెట్టటం, ఫేక్ న్యూస్ వ్యాప్తి చెయ్యటం, అనుమానాలు వచ్చేలా చెయ్యటంతో, ఈ బీహారీ బాబు దిట్ట.. బీహార్ లో ఏ విధంగా అయితే ఇది వరకు కుల గొడవలు పెట్టి, రాజకీయ లబ్ది పొందే వారో, అదే స్ట్రాటజీ ఇక్కడ మన రాష్ట్రంలో ప్రయోగించాలని, ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు ప్రశాంత్ కిషోర్. మొన్నటికి మొన్న, చింతమనేని పై ఫేక్ వీడియో తిప్పారు. అలాగే గుంటూరులో రైతు చనిపోతే, పోలీసులు కొట్టి చంపారు అంటూ, హడావిడి చేసారు. పసుపు కుంకుమ అప్పు అంటూ, పుకార్లు పుట్టించారు. ఇలా అనేక విధాలుగా ప్రశాంత్ కిషోర్ టీం, మన రాష్ట్రంలో ప్రశాంత లేకుండా చేస్తుంది.

bihar 24032019

ఈ నేపధ్యంలో, ప్రశాంత్ కిషోర్ పై, జగన్ పై, చంద్రబాబు విమర్శలు చేస్తూ వస్తున్నారు. హైదరాబాద్ లో కూర్చుని, వీళ్ళ రాజకీయం కోసం, ఏపిలో ఎలాంటి పనులు చేస్తున్నారో విమర్శిస్తూ వస్తున్నారు ప్రతి మీటింగ్ లో, ప్రశాంత్ కిషోర్ నిర్వాకాలు చెప్తూ వస్తున్నారు. అయితే, పాపం ప్రశాంత్ కిషోర్ ఈ మాటల పై హార్ట్ అయ్యారో, లేక తన గుట్టు అంతా చంద్రబాబు విప్పుతున్నారు, ఎప్పటికప్పడు, తనని దోషిగా ప్రజల ముందు నిలబెడుతున్నారు అనే అసహనంతో, కొద్ది రోజుల క్రితం చంద్రబాబు పై ట్విట్టర్ లో వివాదాస్పద ట్వీట్ చేసారు. రాజకీయ కాంట్రాక్టు చేసుకునే ఒక బీహార్ వ్యక్తి, జగన్ అండ చూసుకుని, చంద్రబాబుని విమర్శించే స్థాయికి వచ్చాడు అంటే, బ్యూటీ అఫ్ డెమోక్రసీ అనుకోవటమే.

bihar 24032019

అయితే ఇది మర్చిపోక ముందే, ఇప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. జేడీఎస్‌ ఉపాధ్యక్షుడు, వైసీపీకి రాజకీయ సలహాదారుడుగా ఉన్న ప్రశాంత్‌కిషోర్‌ను ‘బిహారీ బందిపోటు’ అని చంద్రబాబు అభివర్ణించడాన్ని తప్పుబడుతూ స్థానిక న్యాయవాది ఒకరు ఈ పిటిషన్‌ వేశారు. ఇటీవల ఒంగోలులో జరిగిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతూ... వైసీపీకి నేరపూరిత సలహాలిస్తూ రాష్ట్రంలో లక్షలాది ఓట్లు తొలగించేలా బిహారీ డెకాయిట్‌ (ప్రశాంత్‌కిషోర్‌) వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఓ న్యాయవాది... బిహారీలను అవమానించేలా ఏపీ సీఎం వ్యవహరించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని విచారణకు స్వీకరించిన జ్యుడీషియల్‌ మేజిస్ర్టేట్‌ కోర్టు... కేసును మార్చి 28కి వాయిదా వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read